Health : మంచిది కదా అని VITAMIN D సప్లిమెంట్లు అధికంగా వాడుతున్నారా..? ఈ ప్రమాదం పొంచి ఉన్నట్లే..

by Javid Pasha |   (  Updated:2025-08-23 06:10:19  IST  )

విటమిన్ డి సప్లిమెంట్ల అధిక మోతాదువల్ల వికారం, వాంతులు, మలబద్ధకం, ఆకలి లేకపోవడం, బలహీనత, తీవ్రమైన దాహం, తరచూ మూత్ర విసర్జన వంటి లక్షణాలు సంభవిస్తాయి.

Health : మంచిది కదా అని VITAMIN D సప్లిమెంట్లు అధికంగా వాడుతున్నారా..? ఈ ప్రమాదం పొంచి ఉన్నట్లే..
X

దిశ, ఫీచర్స్ : మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి తగిన పోషకాలు, ముఖ్యంగా ప్రోటీన్లు, విటమిన్లు సహజ సిద్ధమైన ఆహారం ద్వారా అందాలి. అయినప్పటికీ కొన్నిసార్లు ఈ లోపం ఏర్పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు సంభవించే అనారోగ్యాలను నివారించడానికి కొందరు మంచిదే కదా అని తాత్కాలికంగా సప్లిమెంట్లు వాడుతుంటారు. ముఖ్యంగా విటమిన్ డి లోపం సంభవించినప్పుడు ఇలా చేస్తుంటారు. అయితే వీటి అధికం వాడకం కూడా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేమిటో చూద్దాం.

నిజానికి విటమిన్ డి లోపం (Vitamin D deficiency) ఏర్పడితే శరీరంలో ఎముకల బలహీనత, కండరాల నొప్పులు వంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. దీంతోపాటు తిమ్మిర్లు, రోగ నిరోధక శక్తి తగ్గడం, డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలు సైతం తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితి దీర్ఘకాలంపాటు కొనసాగితే డయాబెటిస్, కొన్ని రకాల క్యాన్సర్లు, గుండె జబ్బులు ప్రమాదం కూడా పెరిగే చాన్స్ ఉంటుంది. కాబట్టి విటమిన్ డి లోపాన్ని భర్తీ చేయడం చాలా ముఖ్యం. అలాగనీ అధిక మొత్తంలో సప్లిమెంట్లు వాడితే మాత్రం డేంజర్లో పడతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా విటమిన్ డి సప్లిమెంట్ల (Vitamin D supplements) అధిక మోతాదువల్ల హైపర్కాల్సెమియా (రక్తంలో కాల్షియం అధికం అవడం) సంభవిస్తుంది. దీని వల్ల వికారం, వాంతులు, మలబద్ధకం, ఆకలి లేకపోవడం, బలహీనత, తీవ్రమైన దాహం, తరచూ మూత్ర విసర్జన వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాకుండా కిడ్నీ‌ల్లో రాళ్లు ఏర్పడటం(Kidney stones), మానసిక గందరగోళం, గుండె సంబంధిత ఇబ్బందులు సైతం సంభవించే అవకాశం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే అనవసరంగా విటమిన్ డి సప్లిమెంట్లు వాడకూడదు. ఒకవేళ వాడాల్సి వస్తే డాక్టర్ల సలహా మేరకు మాత్రమే వాడాలి. వీలైనంత వరకు చేపలు, గుడ్లు, పాలు వంటి ఆహారాల ద్వారా, ఉదయం పూట సూర్యరశ్మికి గురికావడం వంటి సహజమైన పద్ధతుల ద్వారా మాత్రమే విటమిన్ డి లోపాన్ని భర్తీ చేసుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా పలు హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు. Link

Next Story