Guava : పింక్ జామ పండ్లను తింటే ఇన్ని లాభాలున్నాయా?

by Disha Web Desk 7 |
Guava : పింక్ జామ పండ్లను తింటే ఇన్ని లాభాలున్నాయా?
X

దిశ, ఫీచర్స్: పింక్ కలర్ జామపండ్లను చూస్తే కళ్లు ఆనందపడిపోతాయి. నోట్లో నీళ్లు ఊరుతాయి కూడా. అంతేకాదు పోషకాల పవర్ హౌజ్‌గా ఉన్న ఈ పండు.. కాల్షియం, మాంసకృత్తులు, ఫైబర్ ద్వారా శరీరానికి మెరుగైన న్యూట్రియంట్స్‌ను అందిస్తుంది. డయాబెటిక్స్‌కు కూడా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి దీన్ని ‘సూపర్ ఫుడ్’గా పరిగణిస్తున్న నిపుణులు.. పింక్ జామ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరిస్తున్నారు.

న్యూట్రిషనల్ వాల్యూ

కాల్షియం 14.22 మి.గ్రా

ఐరన్ 0.40 మి.గ్రా

మెగ్నీషియం 13.26 మి.గ్రా

పొటాషియం 270 మి.గ్రా

ప్రోటీన్ 1.19 మి.గ్రా

నీటి శాతం 81.22 గ్రా

ఫైబర్ 7.39 గ్రా

కార్బోహైడ్రేట్ 9.14 గ్రా

విటమిన్ సి 228 మి.గ్రా

బెనిఫిట్స్

1. బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది

100 గ్రాములకి దాదాపు 7 గ్రాముల పీచుతో కూడిన జామ, పెక్టిన్ వంటి ఇతర ఫైబర్‌లతోపాటుగా ఇన్‌సోల్యుబుల్ ఫైబర్‌ను ఎక్కువగా కలిగి ఉంటుంది పింక్ జామ. ఫైబర్ కొలెస్ట్రాల్, LDL (తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్) స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

2. ఇమ్యూనిటీ బూస్టర్

పింక్ జామలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన చర్మాన్ని ప్రోత్సహిస్తుంది. గాయాన్ని నయం చేయడంలో సహాయపడుతుంది. 100 గ్రాముల జామపండులో దాదాపు 228 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది.

3. చర్మం దెబ్బతినకుండా రక్షణ

బీటా-కెరోటిన్, లైకోపీన్స్ వంటి యాంటీఆక్సిడెంట్స్‌ను సమృద్ధిగా కలిగిన గులాబీ జామపండు.. శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. చర్మం దెబ్బతినకుండా, వృద్ధాప్య ప్రక్రియ నుంచి రక్షణను అందిస్తుంది.

4. బరువు తగ్గడంలో సహాయం

అధిక ఫైబర్, నీటి కంటెంట్, పోషక ప్రయోజనాలు కలిగిన గులాబీ జామ బరువును నియంత్రించుకోవాలని చూస్తున్న వారికి ఎక్సలెంట్ మిడ్ డే స్నాక్‌గా ఉపయోగపడుతుంది. దానిపై కొంచెం చాట్ మసాలా చిలకరించడం ఈ ఆరోగ్యకరమైన చిరుతిండికి ఆహ్లాదకరమైన, రుచికరమైన తీపి రుచిని జోడిస్తుంది.

5. రక్తపోటు నియంత్రణ

పింక్ జామలో చెప్పుకోదగ్గ పొటాషియంను కలిగి ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో, నరాల సిగ్నలింగ్, కండరాల సంకోచాల సరైన పనితీరును నిర్ధారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మలేషియన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో పింక్ జామ శరీర బరువు, HFD (హై ఫ్యాట్ డైట్) ప్రేరిత-ఊబకాయ ఎలుకల సిస్టోలిక్ రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుందని కనుగొంది.

6. మధుమేహానికి మంచిది

పుష్కలమైన ఫైబర్, వాటర్ కంటెంట్ ఉన్న పింక్ జామ.. డయాబెటిక్-ఫ్రెండ్లీ ఫ్రూట్‌గా పరిగణించబడుతుంది. ఇది తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంది. దాని అధిక ఫైబర్ కంటెంట్ గ్యాస్ట్రిక్ ఖాళీని నెమ్మదిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్పైక్‌లను నివారించడంలో సహాయపడుతుంది.

Next Story

Most Viewed