Grape Fruits: హైబీపీ, చర్మ క్యాన్సర్ల నివారణకు తోడ్పడుతున్న ద్రాక్షపండ్లు !

by Disha Web Desk 10 |
Grape Fruits: హైబీపీ, చర్మ క్యాన్సర్ల నివారణకు తోడ్పడుతున్న ద్రాక్షపండ్లు !
X

దిశ, ఫీచర్స్ : సమ్మర్ సీజన్‌లో ఎక్కువగా కనిపించే సహజ సిద్ధమైన పండ్లల్లో ద్రాక్ష ఒకటి. ప్రస్తుతం వీటిలోనూ పలు రంగులు కలిగినవి లభిస్తున్నాయి. తినడంవల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అప్పుడప్పుడూ ఒక దోసిటి నిండా పరిమాణంగల ఆయా రంగుల్లో లభించే ద్రాక్షలను తినడంవల్ల డయాబెటిస్, హై బ్లడ్ ప్రెషర్, చర్మ క్యాన్సర్ వంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయిని, రోగ నిరోధక శక్తి పెరిగి వివిధ అనారోగ్యాలు దూరం అవుతాయని ఆహార నిపుణులు చెప్తున్నారు.

రక్త నాళాల పనితీరుకు దోహదం

ద్రాక్ష పండ్లు తినడంవల్ల చర్మ సంబంధిత అలర్జీలు తలెత్తవు. గుండె ఆరోగ్యం, మెదడు, కళ్ల ఆరోగ్యానికి మంచిది. ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. బీపీని కంట్రోల్ చేయడంలో, బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను నివారించడంలో ఈ పండ్లు అద్భుతంగా పనిచేస్తాయి. తక్కువ కేలరీలు, తక్కువ కొలెస్ట్రాల్ కలిగి ఉంటాయి. అంతేగాక యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి -6, విటమిన్ కె, ఫోలేట్, జింక్, పొటాషియం, కాల్షియం వంటివి కూడా ద్రాక్షపండ్లలో ఉండటంవల్ల ఆరోగ్యానికి అన్ని రకాల మేలు చేస్తాయి. ఎర్ర ద్రాక్షలోని రెస్వెరాట్రాల్ అనే మూలకం యాంటీ ఇన్‌ఫ్ల మేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. క్యాన్సర్, గుండె జబ్బుల అవకాశాన్ని దూరం చేస్తుంది. అంతేకాదు అన్ని రకాల ద్రాక్ష పండ్లల్లో ఫ్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మంటలను తగ్గించడంలో, రక్త నాళాల పని తీరును మెరుగు పర్చడంలో దోహదపతాయి. ప్లేట్లెట్స్ గడ్డకట్టే అవకాశాన్ని నివారిస్తాయి.

అధిక బరువు సమస్యను నివారిస్తాయి

ఎరుపు, నలుపు, సాధారణంగా ఉండే లైట్ గ్రీన్ ద్రాక్షల్లోనూ ఫైబర్, నీరు ఉంటాయి. కాబట్టి వీటిని తరచూ తింటూ ఉంటే అధికబరువు సమస్య దూరం అవుతుంది.అంతేగాక బాడీలో సోడియం లెవల్స్ పడిపోకుండా ఉంటుంది. ద్రాక్షలు హైబీపీని నియంత్రిస్తాయి కాబట్టి బీపీ పేషెంట్లు వీటిని తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎర్ర ద్రాక్షలో ఉండే రెస్వెరాట్రాల్ రక్త నాళాలను ఉత్తేజర పరిచి మెదడుకు బ్లడ్ సరఫరా సక్రమంగా జరిగేలా చేస్తుంది.

డయాబెటిస్ పేషెంట్లకు మంచిది కాదా?

డయాబెటిస్ పేషెంట్లు ద్రాక్షపండ్లను తింటే మంచిది కాదని, రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని కొందరు అంటుంటారు. కానీ ఇది నిజం కాదు, అపోహ మాత్రమేనని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ద్రాక్షలో గ్లైసెమిక్ ఇండెక్స్ 53 శాతం మాత్రమే ఉంటుంది కాబట్టి డయాబెటిస్ పేషెంట్లు నిస్సందేహంగా తినవచ్చు.



Next Story