ఫ్రెష్ వాటర్.. ఇండియన్ స్టార్టప్స్

by Disha Web Desk 6 |
ఫ్రెష్ వాటర్.. ఇండియన్ స్టార్టప్స్
X

దిశ, ఫీచర్స్: ప్రపంచంలోని అత్యంత తేమతో కూడిన ప్రధాన నగరాల్లో ఒకటైన చెన్నయ్.. 2019లో నీటి కొరత ఎదుర్కొంది. ఈ మానవ నిర్మిత విపత్తు చెన్నయ్ చరిత్రలో 'డే జీరో'గా నిలిచిపోయింది. వాతావరణ మార్పు, వేగంగా క్షీణిస్తున్న మంచినీటికి ప్రాధాన్యత ఇవ్వకపోతే మానవాళికి ఎలాంటి ముప్పు వాటిల్లుతుందో హెచ్చరించింది. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో నీటి కొరత ఉంటే.. మరికొన్ని ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందనడానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. అయితే ఈ అసమతుల్యతను పరిష్కరించకుంటే.. మానవ మనుగడ, ఉత్పాదకత, అభివృద్ధిపై భారీ ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. అందుకే మంచినీటిని సమర్థవంతంగా ఉపయోగించేందుకు, సాధ్యమైనంత వరకు సంరక్షించేందుకు ఇండియన్ స్టార్టప్స్ తమవంతు కృషి చేస్తున్నాయి. అనేక ఆవిష్కరణలతో ముందుకొస్తున్నాయి.

భూమిలో మూడింట రెండు వంతుల నీరు ఉంది. అయితే ఇందులో మూడు శాతం కంటే తక్కువ మంచినీరు ఉండగా.. 1% కంటే తక్కువ వినియోగానికి అందుబాటులో ఉంది. మంచినీరు తాగడానికి మాత్రమే కాకుండా పరిశ్రమకూ కీలకమైన వనరు. వాయు కాలుష్యం, భూమి ఉపరితలం, మహాసముద్రాలు, నదులు.. మంచినీటి నాణ్యత, పరిమాణంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. విస్తరిస్తున్న జనాభా, పట్టణీకరణ వాతావరణ మార్పులకు దారితీసింది. ప్రపంచవ్యాప్తంగా నదులు, సరస్సులు ఎండిపోయి.. అతిపెద్ద భూగర్భజలాలు తగ్గిపోయేందుకు కారణమైంది.

ఐక్యరాజ్య సమితి ప్రపంచ నీటి అభివృద్ధి నివేదిక 2018 ప్రకారం.. 2050 నాటికి దాదాపు ఆరు బిలియన్ల మంది ప్రజలు స్వచ్ఛమైన నీటి కొరతతో బాధపడే అవకాశం ఉంది. మంచినీటి వనరులను తిరిగి నింపగలిగే దానికంటే వేగంగా క్షీణించడం కొనసాగితే.. ప్రపంచానికి సురక్షితమైన తాగునీటి కొరత తప్పదు. కాగా భారతదేశం నీటి ఒత్తిడిని నిర్వహించడానికి సాంప్రదాయ మరియు మూలాధార పద్ధతులపై ఆధారపడింది. ప్రపంచంలోని మూడవ-అతిపెద్ద స్టార్టప్ పర్యావరణ వ్యవస్థగా ఉన్న భారత్‌ను.. ఆవిష్కరణ మరియు సాంకేతిక సామర్థ్యాన్ని తీసుకురావడానికి, స్థిరమైన పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి, మంచినీటి వనరులపై పెరుగుతున్న ఒత్తిడిని నియంత్రించేందుకు ఇతర దేశాలు ఆశ్రయించాల్సిన సమయం ఆసన్నమైంది.

ఎలక్ట్రిక్ వాహనాల నుంచి సౌర, పవన శక్తిని ఉపయోగించడం వరకు.. యువ పారిశ్రామికవేత్తలు నీటి సమస్యలను పరిష్కరించడానికి హద్దులు చెరిపేస్తూనే ఉన్నారు. భారతీయ స్టార్టప్‌లు కూడా మంచినీటి సమస్యను గుర్తించి సమర్ధవంతంగా సంరక్షించగల పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ఆవిష్కరణలు చేస్తున్నాయి. దేశంలోని కంపెనీలపై ESG పనితీరు కొలమానాలపై కఠిన పరిశీలన, పరిమాణంతో సంబంధం లేకుండా, పెట్టుబడిదారులు వాటర్ సొల్యూషన్ ప్రొవైడర్స్‌లో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నందున స్టార్టప్‌లకు అన్వేషించడానికి కొత్త మార్గాన్ని తెరిచింది. నీటి కొలత, సురక్షితమైన తాగునీటి కోసం పనిచేస్తున్న అనేక విజయవంతమైన స్టార్టప్‌ల ఆవిర్భావానికి కారణమైంది. ఇండియన్ క్లైమేట్ స్టార్టప్‌లకు కూడా మద్దతు ఇవ్వడానికి పెట్టుబడిదారులు ఎక్కువ సుముఖత చూపిస్తున్నారు.

అటువంటి విజయం 'క్రాన్‌బెర్రీ అనలిటిక్స్‌'కు దక్కింది. పూణేకు చెందిన స్టార్టప్.. పింప్రి చించ్‌వాడ్ మరియు గోవాలోని స్థానిక అధికారులతో పాటు ఇతర వాటర్ యుటిలిటీ కంపెనీలతో కలిసి నీటి వినియోగం, నీటి సామర్థ్యాన్ని మ్యాప్ చేయడానికి ఆన్-గ్రౌండ్-ఆన్‌లైన్ టెక్ సొల్యూషన్‌లను అభివృద్ధి చేసింది. నీటి వినియోగాలను పొందడంపై దృష్టి కేంద్రీకరించింది. ఎండ్-టు-ఎండ్ సేవలను అందించే భారతదేశంలోని అతి కొద్ది సంస్థల్లో ఒకటైన క్రాన్ బెర్రీ అనలిటిక్స్.. PCMC(పింప్రి చించ్ వాడ్ మున్సిపల్ కార్పోరేషన్) నీటి విభాగానికి ఆదాయ వృద్ధిని, 100% నీటి బిల్లు పంపిణీని, వినియోగదారుల ఆన్‌బోర్డింగ్‌ను పెంచింది. నాన్-మీటర్డ్ కనెక్షన్‌లను తగ్గించింది. తద్వారా ఈ ప్రాంతంలోని వినియోగదారులకు నీటి సేవల నాణ్యతను మెరుగుపరిచింది. PCMC ప్రాంతంలోనే, Cranberry Analytics సుమారుగా ప్రతి సంవత్సరం10,000 మిలియన్ లీటర్ల నీరు ఆదా చేయడంలో సహాయ పడుతోంది.

ఇక క్రాన్‌బెర్రీతో పాటు, భారతదేశంలో నీటి సమస్యలను పరిష్కరించడానికి సాంకేతిక పరిష్కారాలతో వస్తున్న స్టార్ట్ అప్స్ సంఖ్య పెరుగుతోంది. 'WEGoT' నీటి సంక్షోభాన్ని నివారించడానికి రియల్ టైమ్‌లో సమీకృత నీటి నిర్వహణ పరిష్కారాలను అందిస్తుంది. బెంగళూరుకు చెందిన వాటర్‌టెక్ స్టార్టప్ 'ఉరవూ ల్యాబ్స్' తాగునీటిని సృష్టించడానికి పర్యావరణ తేమ, పునరుత్పాదక శక్తిని ఉపయోగిస్తుంది. కాన్పూర్ బేస్డ్ స్టార్టప్ 'స్వజల్'.. అల్ట్రా-ఫిల్ట్రేషన్, రివర్స్ ఓస్మోసిస్ (RO) టెక్నాలజీతో క్లీన్ చేయబడిన మినరలైజ్డ్ వాటర్‌ను అందిస్తుంది.


Next Story

Most Viewed