బియ్యంలో పురుగులు తొలగిపోవాలంటే ఈ చిట్కాలు పాటించండి!

by Disha Web Desk 9 |
బియ్యంలో పురుగులు తొలగిపోవాలంటే ఈ చిట్కాలు పాటించండి!
X

దిశ, వెబ్‌డెస్క్: వంటింటి సామాన్లలో పప్పులు, ఉప్పులు అరకిలో, కిలో కొనుగోలు చేస్తాం. కానీ.. బియ్యం మాత్రం ఓకేసారి వారి స్తోమతను బట్టి కొంతమంది పాతిక కిలోల బస్తా లేదా 50కిలోల బస్తాను కొంటారు. అయితే బియ్యంలో పురుగులు పట్టడం కామన్ అయిపోయింది. వాటిని బాగు చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. కొంతమంది పురుగులు పట్టిన రైస్ తినడానికి ఆసక్తి చూపరు. రైస్‌కు పురుగులు పట్టకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలను చూద్దాం..

* బియ్యానికి పురుగులు తొలగించాలంటే 10 లవంగాలను తీసుకొని రైస్ బ్యాగ్‌లో వేయ్యండి.

* వెల్లుల్లి రెబ్బల పొట్టును తీశాక బయట పడేయకుండా, బియ్యంలో కలపండి.

*బిర్యానీ ఆకుల వాసన.. పురుగులను, కీటకాలను తరిమికొడుతాయి. బియ్యంలో 5,6 బిర్యానీ ఆకులు ఉంచండి.

* బియ్యంలో పురుగులు రాకుండా ఉండడానికి నల్ల మిరియాలు కూడా ఎంతో మేలు చేస్తాయి.

* రైస్‌ను ఎండలో ఎండబెట్టితే కీటకాలు పూర్తిగా చచ్చిపోతాయి.

* పురుగులు అల్లం వాసనను ఇష్టపడవు కాబట్టి అల్లం ముక్కలు ఒక పాత్రలో వేసి బియ్యం పైన పెట్టండి. ఈ చిట్కాలు పాటిస్తే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. పురుగులు, కీటకాలు దరిచేరకుండా ఉంటాయి.

Also Read.

Alcohol: ఆల్కహాల్ సేవించే ముందు వీటిని తీసుకోవడం మంచిదేనా ?

Next Story

Most Viewed