పెంపుడు జంతువుల వల్ల ధూమపానానికి దూరం: తాజా అధ్యయనం

by Disha Web Desk 9 |
పెంపుడు జంతువుల వల్ల ధూమపానానికి దూరం: తాజా అధ్యయనం
X

దిశ, ఫీచర్స్: సినిమా స్టార్టింగ్, ఇంటర్వెల్‌లో ధూమపానం, మద్యపానం వ్యతిరేక ప్రకటనలు చూస్తుంటాం. కానీ అందరూ లైట్ తీసుకుంటారు. ప్రభుత్వం, స్వచ్చంధ సంస్థలు ఇలాంటి ప్రకటనలు ఇవ్వడం కామన్ అని కొట్టిపడేస్తుంటారు. బయట హోర్డింగ్స్, గోడల మీద యాడ్స్ కనిపించినా.. సర్లే ఇలాంటివి ఎన్నో చెప్తుంటారని వదిలేస్తారు. నిజానికి పొగాకు వల్ల కలిగే పరిణామాల గురించి తెలిసినా సరే దాని నుంచి బయటపడేందుకు ప్రయత్నించరు.

అయితే పెంపుడు జంతువులపై ఆ ప్రభావం పడుతుందంటే మాత్రం క్షణం ఆలస్యం చేయకుండా రియాక్ట్ అవుతున్నారని తెలిపింది తాజా అధ్యయనం. తమ సన్నిహితులు, కుక్కలు, పిల్లులు సెకండ్ హ్యాండ్ స్మోక్ ప్రమాదాన్ని కలిగి ఉన్నాయన్న సోషల్ మీడియా పోస్ట్‌లకు ఎక్కువ రెస్పాన్స్ ఉంటుందని.. తద్వారా పొగాకు మానేస్తున్న వారి సంఖ్య పెరుగుతుందని వివరించింది.

మీనింగ్‌ఫుల్ పర్సనల్ టార్గెట్ పోస్ట్‌లు స్మోకర్స్‌లో మార్పును తీసుకురాగలుగుతున్నాయని తమ అధ్యయనంలో తేలిందని ఫెయిర్‌ఫాక్స్‌ జార్జ్ మాసన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తెలిపారు. స్థానిక ప్రచారాల కంటే ప్రభుత్వం, లాభాపేక్షలేని సంస్థలు చేపడుతున్న ప్రచారాలు వినియోగదారు అటెన్షన్‌ను క్యాచ్ చేయగలుగుతున్నాయని అన్నారు. Facebook యూజర్స్ వీడియో సందేశాలకు ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నట్లు వివరించారు. కాగా ఈ అధ్యయన ఫలితాలు ఉపయోగించి సోష‌ల్ మీడియాను పొగాకు వ్యతిరేక ప్రచార‌ల‌కు శక్తివంతమైన వేదిక‌గా ఉపయోగించుకోవచ్చని వెల్లడించాయి.

ఇవి కూడా చదవండి:


కాళ్లకు పసుపురాసుకునే సమయంలో ఈ తప్పులు అస్సలే చేయకూడదు?

విషంగా మారుతున్న పుదీనా ఫ్లేవర్‌.. లంగ్స్ డ్యామేజ్



Next Story

Most Viewed