ఆస్ట్రో టూరిజంకు బూస్టప్.. దేశంలో తొలి 'నైట్ స్కై శాంక్చువరీ'

by Dishanational4 |
ఆస్ట్రో టూరిజంకు బూస్టప్.. దేశంలో తొలి నైట్ స్కై శాంక్చువరీ
X

దిశ, ఫీచర్స్: ఆకాశంలో జరిగే అద్భుతాలను వీక్షించే అనుభవాన్ని పర్యాటకులకు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దేశంలోనే తొలిసారిగా లడఖ్ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న 'నైట్ స్కై శాంక్చువరీ' పనులు మరో మూడు నెలల్లో పూర్తికానున్నాయని సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ జితేంద్ర సింగ్ శనివారం తెలిపారు.

పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు

ప్రతిపాదిత డార్క్ స్కై రిజర్వ్‌ను చాంగ్‌తంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చువరీలో భాగంగా లడఖ్‌లోని హన్లే గ్రామంలో ఏర్పాటు చేస్తు్న్నారు. ఆప్టికల్, ఇన్‌ఫ్రా-రెడ్, గామా-రే టెలిస్కోప్స్ కలిగిన ఈ సైట్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో ఒకటిగా ఉంటుందని సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్ కే మాథుర్‌తో సమావేశమైన తర్వాత కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారని పీటీఐ నివేదించింది.

ఈ డార్క్ స్కై రిజర్వ్ సైట్.. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంటర్‌వెన్షన్స్ ద్వారా స్థానిక పర్యాటకం, ఆర్థిక వ్యవస్థను పెంచడంలో సాయపడే కార్యకలాపాలను కలిగి ఉంటుందని ఆయన అన్నారు. అంతేకాదు డార్క్ స్కై రిజర్వ్‌ ప్రారంభించేందుకు యూనియన్ టెరిటరీ అడ్మినిస్ట్రేషన్, లడఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్(LAHDC) లేహ్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్(IIA).. ఇటీవలే త్రైపాక్షిక అవగాహన ఒప్పందం(MoU)పై సంతకాలు చేశాయని సింగ్ చెప్పారు.

సైంటిఫిక్ అబ్జర్వేషన్స్, సహజ ఆకాశ పరిస్థితులకు తీవ్ర ముప్పుగా వాటిల్లిన అవాంఛిత కాంతి కాలుష్యం, వెలుతురు నుంచి రాత్రిపూట ఆకాశాన్ని కాపాడేందుకు భాగస్వాములందరూ సంయుక్తంగా కృషి చేస్తారని మంత్రి తెలిపారు.

ఏ విధమైన మానవ అవాంతరాలు లేకుండా స్పష్టమైన ఆకాశం, పొడి వాతావరణ పరిస్థితులు ఏడాది పొడవునా ఉన్నందునన లడఖ్‌లోని చల్లని ఎడారి ప్రాంతం హన్లే ఈ ప్రాజెక్టుకు బాగా సరిపోతుందని ఆయన అన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్.. ఉత్కంఠభరితమైన ప్రకృతి దృశ్యాలు, స్ఫటికాకార స్పష్టమైన ఆకాశం, ఎత్తైన పర్వత మార్గాలు, థ్రిల్లింగ్ సాహస కార్యకలాపాలు, బౌద్ధ విహారాల, పండుగలకు ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే.

ఏకంగా వీర్యంతోనే.. ఈ మహిళ చేసే పని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?



Next Story

Most Viewed