నడుము నొప్పి వేధిస్తోందా?.. ఇలా చేస్తే మందులు వాడకుండానే తగ్గించుకోవచ్చు !

by Dishafeatures2 |
నడుము నొప్పి వేధిస్తోందా?.. ఇలా చేస్తే మందులు వాడకుండానే తగ్గించుకోవచ్చు !
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం అనేక మందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో నడుము నొప్పి ఒకటి. మారుతున్న జీవన శైలి, తరచుగా కూర్చోవడం, లేవడం వంటి పనుల్లో నిమగ్నం కావడం, ఎక్కువసేపు ఒకేచోట కూర్చోవడం, సరైన భంగిమలో పడుకోకపోవడం, శారీరక బలహీనత, ఆహారపు అలవాట్లలో మార్పులు ఇందుకు కారణం అవుతున్నాయి. ఒకప్పుడు నడీడు వయస్సు దాటాకే బ్యాక్ పెయిన్స్ వచ్చేవి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. వయస్సుతో సంబంధం లేకుండా అందరినీ ఎవరిలోనైనా ఇది వచ్చే చాన్సెస్ ఉన్నాయి. అయితే ఈ నొప్పి రాకుండా ఏం చేయాలి? మందులు, చికిత్స లేకుండానే సమస్య నుంచి ఎలా బయటపడాలి? తదితర విషయాలను పరిశీలిద్దాం.

వ్యాయామాలు ముఖ్యం

నడుము నొప్పి నుంచి ఉపశమనానికి వ్యాయామం చక్కటి పరిష్కారమని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే‌ ఎక్సర్‌ సైజ్ వల్ల కండలు, ఎముకలు దృఢంగా తయారవుతాయి. డైలీ అరగంట వివిధ వ్యాయామాలు లేదా శారీరక శ్రమ కలిగి ఉంటే వెన్ను నొప్పి సహజంగానే రాదు. వచ్చినా ఒకటీ రెండు రోజుల్లో తగ్గిపోతుంది. అయితే నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు బాడీ ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది కాబట్టి ఫిట్‌నెస్ ట్రైనర్ లేదా ఫిజియో థెరపిస్ట్ సలహా మేరకు వ్యాయామం చేయడం మంచిది.

పొజిషన్‌లో మార్పులు

వెన్ను లేదా నడుము నొప్పికి సరైన భంగిమలో కూర్చోకపోవడం కూడా కారణం కావచ్చు. కాబట్టి కూర్చునేటప్పుడు, లేచేటప్పుడు, నిద్రపోతున్నప్పుడు సరైన పొజిషన్‌లో ఉండేలా జాగ్రత్త పడాలని నిపుణులు సూచిస్తున్నారు. స్ట్రైట్‌గా కూర్చోవడం, షోల్డర్స్‌ను నిటారుగా ఉంచడం, కంఫర్టబుల్ చెయిర్‌ను యూజ్ చేయడం, బరువైన వస్తువులు ఎత్తేటప్పుడు, మెట్లపై నడిచేటప్పుడు సరైన టెక్నిక్స్ పాటించడం నడుము నొప్పి నివారణ చర్యలుగా ఉపయోగపడతాయి. దీంతోపాటు నొప్పి నుంచి ఉపశమనానికి హాట్ అండ్ ఐస్ వాటర్ థెరపీని ప్రయత్నించవచ్చు. గోరు వెచ్చని లేదా చల్లటి నీటితో స్నానం చేయడం, కంప్రెస్ చేయడం వల్ల కండరాలు రిలాక్స్ అయి నొప్పి తగ్గుతుంది. అయినా తగ్గకపోతే వైద్య నిపుణులను సంప్రదించాలి.

Next Story

Most Viewed