- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చలి కారణంగా వ్యాయామం చేయలేకపోతున్నారా? .. ఈ టిప్స్ మీకోసమే!
వ్యాయామాలు చేయలేనివారు, సరైన ఆహార నియమాలు పాటించేలేని పరిస్థితుల్లో.. మీ రోజువారీ డైట్‌లో అధిక చక్కెరలను తగ్గించినా మంచి ఫలితం ఉంటుందని నిపుణులు అంటున్నారు.

దిశ, ఫీచర్స్ : అసలే చలికాలం. వ్యాయామం చేయాలని ఉన్నా చాలామంది చలి కారణంగా నిద్రలేవలేకపోతారు. మరికొందరు టైమ్ సెట్ అవ్వట్లేదని ఎక్సర్‌సైజ్ మానేస్తుంటారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనే హెల్తీగా, ఫిట్‌గా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా రోజువారీ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు. అవేమిటి? ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో చూద్దాం.
*వ్యాయామాలు చేయలేనివారు, సరైన ఆహార నియమాలు పాటించేలేని పరిస్థితుల్లో.. మీ రోజువారీ డైట్‌లో అధిక చక్కెరలను తగ్గించినా మంచి ఫలితం ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే చక్కెరలో, తియ్యటి ఆహారాలు, పానీయాలలో ఫ్రక్టోజ్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఇన్సులిన్ నిరోధకతకు, మెటబాలిక్ సిండ్రోమ్, ఫ్యాటీ లివర్ వంటి వ్యాధులకు కారణం అవుతుంది. అట్లనే షుగర్ రిలేటెడ్ ఆహారాలు ఎక్కువగా తీసుకోవడంవల్ల అందులోని సుక్రోజ్ అండ్ ఫ్రక్టోజ్ సమ్మేళనాలు ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బుల ముప్పును పెంచుతాయి. కాబట్టి వాటిని తగ్గించాలంటున్నారు నిపుణులు.
*డైట్‌లో షుగర్ తగ్గించడంవల్ల కలిగే బెనిఫిట్స్ గురించి చూస్తే రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంతేకాకుండా మీ రొటీన్ నుంచి షుగర్‌ను తగ్గించడంవల్ల డైజెస్టివ్ హెల్త్ కూడా మెరుగు పడుతుంది. కేలరీలు ఆటోమేటిగ్గా బర్న్ అవుతాయి. దీంతో బాడీలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయే చాన్స్ ఉంటుంది. కాబట్టి అధిక బరువు కూడా తగ్గుతారు.
*అధిక చక్కెరలు కలిగిన పదార్థాలు మానేయడంవల్ల ముఖంలో వృద్ధాప్య ఛాయలు, మొటిమలు వంటివి దూరం అవుతాయని. యంగెస్ట్ లుక్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అట్లనే టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి. దంతాలు పుచ్చిపోవడం, నోటి దుర్వాసన వంటివి రావు. స్ట్రెస్, యాంగ్జైటీస్, డిప్రెషన్ వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి. అయితే ఎల్లప్పుడూ వ్యాయామాలు చేయకపోవడం మాత్రం మంచిది కాదు. శారీరక శ్రమ ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారు. అప్పుడప్పుడూ కొన్ని రోజులు లేదా అనారోగ్యాల కారణంగానో, చలి కారణంగానో ఫిజికల్ యాక్టివిటీస్‌లో పాల్గొనని వారు ఈ విధమైన ఆహారాలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






