- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉదయం లేవగానే మీ పిల్లలు బ్రష్ చేయడం లేదా..? ఈ రిస్క్ తప్పదు..!
ఉదయం లేవగానే మీ పిల్లలు బ్రష్ చేయడం లేదా..? ఈ రిస్క్ తప్పదు..!

దిశ, ఫీచర్స్ : ప్రతిరోజూ ఉదయం లేవగానే బ్రష్ చేయడం, మొహం కడుక్కోవడం దినచర్యలో భాగం. కానీ ఏడెనిమిదేండ్లలోపు వయసు గల పిల్లల్లో కొందరు ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తుంటారు. పేరెంట్స్ వెంటపడితే గానీ చేయకపోవడం, చేసినా సరిగ్గా చేయకపోవడం, లేటుగా చేయడం, ఒక్కోసారి చేయకుండానే తినడం వంటివి కూడా చేస్తుంటారు. కానీ ఇది చాలా ప్రమాదకరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే.. ఉదయంపూట బ్రష్ చేయకపోవడమనే పొరపాటు కొంత కాలానికి చిగుళ్ల సమస్యకు తద్వారా తల, మెడ క్యాన్సర్లకు దారితీసే అవకాశం ఉందని ‘ది జర్నల్ ఆఫ్ జామా అంకాలజీ’లో పబ్లిషైన ఒక అధ్యయనం తెలిపింది. పిల్లలే కాదు, పెద్దల్లో కూడా ఓరల్ హైజీన్ సరిగ్గా లేకపోతే బ్లడ్ ప్రెజర్ కూడా పెరిగే చాన్స్ ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
బ్రష్ చేయకపోవడం, నోటి ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం ఏ విధంగా ప్రభావితం చేస్తుందో తెలుసుకునే అధ్యయనంలో భాగంగా ఆరోగ్య శాస్త్రవేత్తలు మహిళలు, పురుషుల నోటిలోని లాలాజలం నుంచి వందలాది బ్యాక్టీరియాలను సేకరించారు. వాటి జెనెటిక్ స్ట్రక్చర్‌ను విశ్లేషించారు. అయితే వీటిలో 13 రకాల బ్యాక్టీరియాల తలు, మెడ భాగాల్లో కణితులు, క్యాన్సర్లతో సంబంధం కలిగి ఉన్నాయని ఈ సందర్భంగా కనుగొన్నారు. అట్లనే చిగుళ్ల వ్యాధిని కలిగించే బ్యాక్టీరియాలలో 50 శాతం వరకు తల, మెడ క్యాన్సర్లకు కూడా కారణం అవుతున్నట్లు గుర్తించారు. అందుకే ప్రతిరోజూ బ్రష్ చేయాలని, నోటిని, దంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తు్న్నారు.






