- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Self-compassion : ఇతరులపై మాత్రమే కాదు, మీ మీద మీకు దయ ఉందా?
Self-compassion : ఇతరులపై మాత్రమే కాదు, మీ మీద మీకు దయ ఉందా?

దిశ, ఫీచర్స్ : మనం తరచుగా సెల్ఫ్ కంపాషన్, సెల్ఫ్ కైండ్‌నెస్ గురించి మాట్లాడుతుంటాం. వివిధ సంర్భాల్లో ఇతరుల పట్ల జాలి, దయ, కరుణ వంటి భావాలను వ్యక్త పరుస్తుంటాం. అయితే సొసైటీలో మనుషుల మధ్య ఇటువంటి ఇంటరాక్షన్స్ గొప్ప ఓదార్పునివ్వడమే కాకుండా, మానవ సంబంధాలను బలోపేతం చేస్తాయి. బాధితుల్లో ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, ధైర్యాన్ని నింపుతాయి. భరోసాను, ఆత్మ విశ్వాసాన్ని కలిగిస్తాయి. అయితే ఇదంతా చాలా వరకు మనం ఇతరులపట్ల వ్యవహరించే ప్రవర్తనగానే ఉంటుంది. కానీ సెల్ఫ్ కంపాషన్ లేదా సెల్ఫ్ కైండ్‌నెస్ కూడా ప్రతీ ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యం. ఒక వ్యక్తి ఇతరులపట్ల దయ, కరుణ వంటివి చూపడం అవసరమే. కానీ తనపట్ల తాను కూడా కలిగి ఉండకపోతేనే నష్టం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
సమాజంలో ఎలా ఉండాలో, దయతో ఎలా మెలగాలో మనం చిన్నప్పటి నుంచే నేర్చుకుంటాం. ఇతరులకు నేర్పుతుంటాం. కానీ సెల్ఫ్- కైండ్‌నెస్ (స్వీయ దయ లేదా కరుణ) గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావనకు రాదు. బదులుగా సెల్ఫ్‌సాక్రిఫై (ఆత్మత్యాగం), ఆత్మ విమర్శలపై మన విజయం ఆధారపడి ఉంటుందనే మాటలు వినడం, చెప్పడం, కొన్నిసార్లు పాటించడం చేస్తుంటాం. అయితే మనల్ని నిర్లక్ష్యం చేసుకునేంతగా ఇతరులపట్ల జాలి, దయ, ఆత్మత్యాగం వంటివి కలిగి ఉండటం కొన్నిసార్లు స్వీయ నష్టాన్ని కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో చదువులో, వృత్తిలో, చేసే ప్రతి పనిలో ఎక్కడైనా ఇబ్బంది పడే చాన్స్ ఉంటుంది.
సెల్ఫ్ కైండ్‌నెస్ అంటే ?
స్నేహితులు లేదా ఆత్మీయులు ఇంకెవరైనా సరే.. కష్టాల్లో, బాధల్లో ఉన్నప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాం. సాధారణంగా మన ఆలోచనలు, భావాలు, చర్యలు వారిని ఓదార్చేలా, కష్టాల్లోంచి బయటపడేసేలా ఉంటాయి. ఇదే విషయాన్ని మనకు మనం వర్తింపజేసుకోవడమే సెల్ఫ్ కైండ్‌నెస్ లేదా స్వీయ కరుణ అసలు ఉద్దేశం అంటున్నారు నిపుణులు. దీనివల్ల కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని మనం ఓదార్చుకుంటాం. అధిక ఒత్తిడిలో, అవస్థల్లో బర్న్ అవుట్ కాకుండా ఉంటాం. అతి ఆలోచలు, మానసిక ఇబ్బందులను ఎదుర్కొంటూ స్వయం సామర్థ్యాన్ని పెంపొందించుకుంటాం. మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటాం. అందుకోసం మైండ్ ఫుల్‌నెస్ కూడా అసవరం. ఇది సెల్ఫ్ కైండ్‌నెస్‌లో ఒక భాగం. మనపట్ల మనం దయగా ఉన్నప్పుడే మనలోని లోపాన్ని, వాస్తవాన్ని గుర్తించి మనల్ని మనం తీర్చిదిద్దుకుంటాం.
మానవత్వం , స్వీయ ఆలోచన
సాధారణంగా మనం మానవత్వాన్ని కలిగి ఉంటాం. అయితే ఇది ఇతరులపట్ల మాత్రమే కాకుండా మనపట్ల మనం కూడా కలిగి ఉండాలని, అవసరమైనప్పుడు ప్రదర్శించాలని, తద్వారా స్వీయ ఎదుగుదలకు మార్గం ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు మనం అనుభవించే ఇబ్బందులు, బాధలు వంటి అనుభవాలు కూడా మనల్ని మనుషులుగా ఏకం చేసేవిగానూ, ఆలోచింపజేసేవిగానూ, ఓదార్పునిచ్చేవిగానూ ఉంటాయి. ఉదాహరణకు నిద్రలేమితో బాధపడుతున్న ఒక వ్యక్తి రాత్రిళ్లు అతి ఆలోచనల నుంచి బయటపడాలంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర బాధితులు కూడా సరిగ్గా అదే పరిస్థితిని అనుభవిస్తుంటారని, తనలాగే బాధపడతుంటారని గుర్తించగలగాలి. అనేక విషయాల్లో ఇటువంటి ఆలోచనలు మనం ఒంటరిగా ఉన్న అనుభూతిని దూరం చేస్తాయి. మనపట్ల మనం దయగా ఉండేలా చేస్తాయి. ఆ తర్వాత సమస్యలు పరిష్కారం అవుతాయి.






