Eggs: గుడ్లను తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో.. ఇక్కడ తెలుసుకుందాం!

by Disha Web Desk 10 |
Eggs: గుడ్లను తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో.. ఇక్కడ  తెలుసుకుందాం!
X

దిశ, వెబ్ డెస్క్ : మనకి బాగా ఆకలిగా ఉన్నప్పుడు త్వరగా ప్రిపేర్ చేసుకునే ఫుడ్ ఎగ్ కర్రీ. ఇంటికి వచ్చిన అతిథులకు హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ ప్రిపేర్ చేయాలన్నా.. తక్కువ ఖర్చుతోనే పోషకాలున్న ఫుడ్‌ని తీసుకోవాలనుకున్నా గుడ్డును మించినది మరొకటి ఉండదు. ఈ గుడ్డు కూరను ఒక రకం అని కాకుండా అనేక రకాలుగా వండుకొని తినవచ్చు. టమోటో ఎగ్, ఎగ్ ఫ్రై, ఎగ్ కుర్మా, ఎగ్ ఆమ్లెట్‌ ఇలా ఎన్నో రకాలుగా ప్రిపేర్ చేయవచ్చు.

ఇన్ని రకాలుగా తయారు చేసుకునే గుడ్డుని ఏ విధంగా తినవచ్చో ఇక్కడ చదివి తెలుసుకుందాం. మనలో చాలా మంది ఎగ్స్ తింటుంటారు. ఇవి సాధారణంగా తెలుపు, గోధుమ రంగులో లభిస్తాయి. మొత్తం గుడ్డులో 70 శాతం తెల్లసొన, 30 శాతం పచ్చసొన ఉంటుంది. ఒక గుడ్డులో 6.3 గ్రాముల ప్రోటీన్స్ పాటు, విటమిన్స్, ఖనిజాలు ఉంటాయి. గుడ్డులోని పచ్చసొన ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని తినడం వల్ల ఇందులోనీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చేపలకు సమానమైనవిగా వైద్యులు పేర్కొంటున్నారు. గుడ్లను తినడం ద్వారా శరీరంలోని చెడు కొవ్వును తగ్గించడంతోపాటు మంచి కొవ్వుని పెంచుతాయి. దీని వల్ల ఫ్యాట్ తగ్గే అవకాశం ఉన్నది. గుడ్డు కండరాలను నిర్మించి, శక్తిని పెంచేలా చేస్తుంది. రోజంతా మనల్ని యాక్టివ్‌ గా ఉండేలా చేస్తుంది. చురుగ్గా ఉండేందుకు బ్రేక్‌ఫాస్ట్‌‌లో రోజుకు 2 గుడ్లు తీసుకుంటే శరీరానికి కావాల్సిన ప్రోటీన్ అందుతుంది.

ఇవి కూడా చదవండి : Walking: జస్ట్ 11 మినిట్స్ వాకింగ్.. మీ ఆయుష్షును పెంచుతుంది!


Next Story

Most Viewed