Walking: జస్ట్ 11 మినిట్స్ వాకింగ్.. మీ ఆయుష్షును పెంచుతుంది!

by Disha Web Desk 10 |
Walking: జస్ట్ 11 మినిట్స్ వాకింగ్.. మీ ఆయుష్షును పెంచుతుంది!
X

దిశ, ఫీచర్స్ : మీరు ఆరోగ్యంగా ఉండాలంటే హెల్తీ ఫుడ్ తీసుకున్నంత మాత్రాన సరిపోదు. తగిన శారీరక శ్రమ లేదా వ్యాయామం తప్పక అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అన్నిరకాల వ్యాయామం చేయడానికి వీలుపడని వారు చాలా ఈజీ మెథడ్ అయినటువంటి వాకింగ్‌ను ఎంచుకోవచ్చు. ప్రతి రోజూ కేవలం 11 నిమిషాల వాకింగ్‌ వల్ల ఆయుష్షు పెరుగుతుందని, ప్రతీ 10 మందిలో ఒకరి అకాల మరణాన్ని నివారించవ్చని, బ్రిటీష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో పబ్లిష్ అయిన తాజా అధ్యయనం వెల్లడించింది.

ఫాస్ట్ వాకింగ్ లేదా తగిన శారీరక శ్రమవల్ల అన్ని రకాల గుండె సంబంధిత జబ్బులను, వ్యాధులను నివారిస్తుంది. కొన్ని రకాల క్యాన్సర్ల ప్రభావాలను తగ్గిస్తుంది. ‘‘వారానికి 75 నిమిషాలకు సమానమైన ఏరోబిక్ ఫిజికల్ యాక్టివిటీస్ కలిగి ఉండటం మూలంగా అన్ని రకాల వ్యాధులు దూరం అవుతాయని, గుండె జబ్బుల ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని కూడా పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని నేషనల్ హెల్త్ సర్వీసెస్ (NHS) వారానికి 150 నిమిషాల శారీరక శ్రమకు సమానమైన వర్కవుట్‌లను సిఫార్సు చేస్తోంది.

పరిశోధనలో భాగంగా నిపుణులు 196 కంటే ఎక్కువ అధ్యయనాలను నిర్వహించారు. వారానికి 150 నిమిషాలు శారీరక శ్రమ కలిగి ఉండటం చాలామంచిదని, అలాంటి అవకాశం లేనివారు కనీసం వారానికి 75 నిమిషాలైన శారీరక శ్రమ లేదా వ్యాయామం తప్పక ఉండేలా చూసుకోవాలని కేంబ్రిడ్జ్ మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ (MRC) ఎపిడెమియాలజీ విభాగానికి చెందిన డాక్టర్ సోరెన్ బ్రేజ్ చెప్తున్నారు. ఈ మాత్రం శారీరక శ్రమ లేకుంటే రోగాల బారిన పడే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. వారానికి 150 నిమిషాల వ్యాయామం చేయాలన్న నిపుణుల సిఫార్సును అనుసరించినట్లయితే ప్రతీ ఆరుగురిలో ఒకరి అకాల మరణాన్ని నివారించవచ్చని తెలిపారు. అలాగే ప్రతీ రోజూ 11 నిమిషాలు ఫాస్ట్ వాకింగ్ వల్ల ప్రతీ పదిమందిలో ఒకరి అకాల మరణాన్ని నివారించవచ్చని కూడా పరిశోధకులు నిర్ధారించారు. డ్యాన్స్, టెన్నిస్, రన్నింగ్, వాలీబాల్ వంటి ఆటలు కూడా అకాల మరణాల రేటును తగ్గించే లిస్టులో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి : Eggs: గుడ్లను తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో.. ఇక్కడ తెలుసుకుందాం!

Next Story

Most Viewed