ఆ చేపలు తింటే గుండె జబ్బులకు చెక్ పెట్టొచ్చు!

by Disha Web Desk 10 |
ఆ చేపలు తింటే గుండె జబ్బులకు చెక్ పెట్టొచ్చు!
X

దిశ, వెబ్ డెస్క్: చేపల వల్ల మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి. వైద్యులు కూడా చేపలు తినమని చెబుతుంటారు. చేపలు తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..

సాల్మన్ చేపల్లో ఒమేగా 3 ఫాటీ ఆసిడ్స్, విటిమిన్ డి ఉంటాయి. వీటిని తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. సహజ సిద్ధంగా సముద్రాల్లో దొరికే సాల్మన్ చేపలు తక్కువ ధరకే లభిస్తాయి . కాబట్టి వీటిని చాలా మంది కొంటారు. వైల్డ్ సాల్మన్ చేప చాలా మంచిది. దీనిలో విటమిన్స్ , మినరల్స్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రపంచంలోని అత్యంత ఆరోగ్యకరమైన ఆహారాలలో ఇది కూడా ఒకటి. దీనినే పొలుసుల చేపలు అని కూడా అంటారు. దీనిలో విటమిన్ బి12, ఒమేగా ఒమేగా 3 ఫాటీ ఆసిడ్స్ ఉంటాయి. ఈ చేపను తీసుకోవడం వలన ఆరోగ్య సమస్యల్ని దూరం చేస్తుంది. అథెరోస్క్లోరోసిస్‌ తో బాధపడేవారికి, డయాబెటిక్ హార్ట్ పేషెంట్స్‌కి చాలా మంచిది. ఈ చేపలు తినేవారికి గుండె సమస్యలు వచ్చే రిస్క్ తక్కువగా ఉంటుంది.హెర్రింగ్ చేపలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎర్ర రక్తకణాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఎముకలని బలంగా చేస్తాయి. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

Read More : దానిమ్మ రసం తీసుకోవడం వల్ల ఈ అనారోగ్య సమస్యలన్నీ పరార్..!

కీళ్ల నొప్పులు ఉన్నవారు పెరుగు తినొచ్చా? తాజా వెల్లడి..!



Next Story

Most Viewed