కీళ్ల నొప్పులు ఉన్నవారు పెరుగు తినొచ్చా? తాజా వెల్లడి..!
ఆర్థరైటిస్ అనేది కీళ్లలో నొప్పి ఉన్న ఒక వ్యాధి. ఇది 100 కంటే ఎక్కువ రకాలు ఉంటాయి.
ఈ వ్యాధి వల్ల శరీరంలోని బోన్స్ బలహీనపడి అనేక రకాల సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది.
తీవ్రమైన కీల్లనొప్పుల కారణంగా నవడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు.
అలాగే చేతులు, కాళ్ల కీలు దగ్గర లేదా శరీరంలోని ఇతర భాగాల వద్ద నొప్పి ఉంటుంది.
కండరాల బలహీనతతో పాటు జ్వరం లక్షణాలు కూడా కనిపిస్తాయి.
ప్రస్తుత రోజుల్లో యువత కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు.
అయితే పెరుగు, పుల్లటి ఆహారం తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు ఎక్కువవుతాయని కొంతమంది భావన.
టమాట లాంటి పులుపు పదార్థాలు తినడం వల్ల కొందరిలో కొన్నిసార్లు నొప్పి వస్తుంటుంది.
కానీ ఇంతవరకు ఈ ఆహారాలు తీసుకోవడం వల్ల కీళ్లనొప్పులు ఎక్కువుతాయని ఇంకా ఏ పరిశోధనలో రుజువు కాలేదని వైద్యులు చెబుతున్నారు.
ఇంకా పెరుగు తినకపోవడం వల్ల దాని నుంచి లభించే విటమిన్లు, పోషకాలు శరీరానికి అందవని అంటున్నారు డాక్టర్లు.