మానవుల పై ప్రతీకారం తీర్చుకుంటున్న భూమి.. భయాందోళనలో ప్రజలు..

by Disha Web Desk 20 |
మానవుల పై ప్రతీకారం తీర్చుకుంటున్న భూమి.. భయాందోళనలో ప్రజలు..
X

దిశ, ఫీచర్స్ : నేటి కాలంలో మానవులు తమ స్వార్థం కోసం ప్రకృతిని నాశనం చేస్తున్నారు. అడవులు, చెట్లను నరికేసి భూమాతను బకాసురుల లాగా మింగేస్తున్నారు. ప్రకృతి ఆగ్రహిస్తుంది అని తెలిసినా ఏమీ ఆలోచించకుండా భూమిని దోపిడీ చేస్తున్నారు. దీంతో భూమి కూడా మెల్లమెల్లగా మానవ జాతి పై ప్రతీకారం తీర్చుకుంటోంది. ఇలాంటి ఒక ప్రదేశమే ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ప్రకృతి మానవులపై ఎలా పగ తీర్చుకుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉత్తరాఖండ్‌లోని జోషిమత్ కథ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడ భూమి క్షీణించిందనే వార్త ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. వాస్తవానికి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది సోవియట్ కాలంలో పొటాష్ గని పై నిర్మించిన బెరెజ్నికి గురించి. 19వ శతాబ్దంలో పొటాష్ అధికంగా వెలికితీసేందుకు ఇక్కడ నిరంతర తవ్వకాలు జరిగాయి.ఈ రోజు ఈ ప్రదేశం మునిగిపోయే జోన్‌లోకి వచ్చింది. ఇక్కడ నివసించే ప్రజలు నగరం విడిచి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు.

ఈ నగరం ఎందుకు ప్రత్యేకం ?

మీడియా నివేదికల ప్రకారం నిరంతర త్రవ్వకాల కారణంగా, భూమి కింద లోతైన గుంతలు ఏర్పడ్డాయి. ఇవి ఒక గుహలాగా కనిపిస్తాయి. వాటి పై కప్పులు స్తంభాల పై ఉన్నాయి. ఈ స్థలం గురించి 2006 సంవత్సరంలో ఒక నివేదిక వచ్చింది. దాని ప్రకారం గనిలో 720 నుండి 1,500 అడుగుల దిగువన మంచి నీరు ప్రవహించడం ప్రారంభించింది. ఇది గోడలు, స్తంభాలను నాశనం చేసింది. దీంతో నగరం మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది.

ఈ నగరం ప్రపంచంలోని 10% పొటాష్ అవసరాలను తీరుస్తుంది. ఈ గని వల్ల ఇక్కడ నివసిస్తున్న చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు ఈ గనిని మూసివేస్తే ఇక్కడి ప్రజల ఉద్యోగాలు ఏమవుతాయనే ప్రమాదం ప్రజలకు పొంచి ఉంది. ఈ సమస్య కారణంగా, 2019లో 12,000 మంది బెరెజ్నికిని విడిచిపెట్టారు

Next Story