అజిత్రోమైసిన్‌తో ప్రసవ సమయంలో తల్లుల మరణానికి చెక్

by Disha Web Desk 7 |
అజిత్రోమైసిన్‌తో ప్రసవ సమయంలో తల్లుల మరణానికి చెక్
X

దిశ, ఫీచర్స్: ప్రసవ సమయంలో చవకైన యాంటీబయాటిక్ అజిత్రోమైసిన్ తీసుకుంటే గర్భిణీ స్త్రీల మరణ ప్రమాదం గణనీయంగా తగ్గినట్లు తెలిపారు శాస్త్రవేత్తలు. యాదృచ్ఛిక క్లినికల్ ట్రయల్స్‌లో ఈ ఫలితాలు వచ్చినట్లు వివరించారు. యోని ప్రసవానికి ముందు అజిత్రోమైసిన్ స్వీకరించిన స్త్రీలు ప్లేసిబో పొందిన వారితో పోలిస్తే.. మెటర్నల్ డెత్ 33శాతం తగ్గినట్లు, సెప్సిస్ డేంజర్ 35శాతం తగ్గించినట్లు గుర్తించారు. అంటే అజిత్రోమైసిన్ ఒక్క మోతాదు ప్రసూతి మరణానికి తక్కువ ధరలో పరిష్కారాన్ని సూచించగా.. తదుపరి ప్రయోగానికి బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌ ప్రాథమిక నిధులు సమకూర్చింది.

మొత్తం 29,278 మంది మహిళలపై చేసిన ప్రయోగంలో.. 14,590 మంది అజిత్రోమైసిన్(2-గ్రాములు) 14,688 మంది ప్లేసిబోను స్వీకరించడానికి కేటాయించబడ్డారు. రెండు సమూహాలలో మధ్యస్థ వయస్సు 24 సంవత్సరాలు. కాగా అజిత్రోమైసిన్ సమూహంలో 1.6%, ప్లేసిబోలో 2.4% స్త్రీలలో ప్రసూతి మరణం సంభవించింది.

అజిత్రోమైసిన్ సమూహంలోని మహిళలకు ఎండోమెట్రిటిస్, గాయం ఇన్ఫెక్షన్లు , ఇతర అంటువ్యాధులు కూడా తక్కువగా ఉన్నాయి. అజిత్రోమైసిన్ తీసుకున్న వారిలో 7.1%, ప్లేసిబో గ్రూప్‌లో 7.6% ప్రసూతి దుష్ప్రభావాలు నివేదించబడ్డాయి. అంటే ప్లేసిబోతో పోలిస్తే.. అజిత్రోమైసిన్ నిర్దిష్ట ఇన్ఫెక్షన్లను తగ్గించడం ద్వారా ప్రసవ సమయంలో గర్భిణీల మరణాలను నిరోధిస్తుంది. ఈ పరిశోధనలు ప్రసూతి ఫలితాలను ఖర్చుతో సమర్థవంతంగా మెరుగుపరిచే సామర్థ్యాన్ని కూడా సూచిస్తున్నాయి.



Next Story

Most Viewed