జుట్టు విరబోసుకుంటే నిజంగానే దెయ్యాలు పడుతాయా?

by Dishanational2 |
జుట్టు విరబోసుకుంటే నిజంగానే దెయ్యాలు పడుతాయా?
X

దిశ, వెబ్‌డెస్క్ : పూర్వకాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతీ ఒక్కరు జుట్టుకు నూనె పెట్టుకొని ఎంతో అందంగా దగ్గరగా జుట్టు వేసుకునే వారు. ఇక ఆ కాలంలో జుట్ కట్ చేయడం కానీ, విరబోసుకోవడం వంటివి ఉండకపోవు. ఇక ప్రస్తుతం ట్రెండ్ మారింది అంటూ చిన్న పిల్లల నుంచి ఆంటీల వరకు ప్రతీ ఒక్కరు జుట్టు విరబోసుకోవడం కామన్ అయిపోయింది. ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే,జుట్టు విరబోసుకోవడం కామన్ అయ్యింది.

అయితే ఇప్పటికీ మన పెద్దవారు అంటుంటారు. జుట్టు విరబోసుకొని తిరగకండి,దెయ్యాలు పడుతాయని చెబుతుంటారు. అయితే మరి నిజంగానే జుట్టు విరబోసుకుంటే దెయ్యాలు పడుతాయా లేదా చూద్దాం..ఇక జుట్టు విరబోసుకుంటే పిశాచాలకు ఆహ్వానం పలకడమే అంటారు పండితులు. తలకి స్నానం చేసిన తర్వాత కూడా జుట్టు ఆరేలోగా కనీసం చివర్లైనా ముడివేయాలంటారు. జుట్టు విరబోసుకుని, క్లిప్పులు పెట్టుకుని దేవాలయానికి వెళ్లకూడదు. అలా చేస్తే జ్యేష్టా దేవి మీ వెంటే ఉంటుందట.

Also Read..

యువతలోనూ హైపర్ టెన్షన్.. తగ్గించుకునే మార్గాలివే


Next Story

Most Viewed