అంబేడ్కర్ విగ్రహాలకు నీలి రంగు కోటే ఎందుకు ఉంటుందో తెలుసా..?

by Disha Web Desk 7 |
అంబేడ్కర్ విగ్రహాలకు నీలి రంగు కోటే ఎందుకు ఉంటుందో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 132 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఎత్తైన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైంది కావడం విశేషం. అయితే మనకు కనిపిస్తున్న విగ్రాహాల్లో అంబేడ్కర్ భారత రాజ్యాంగాన్ని ఓ చేత పట్టుకుని, మరొక చేతితో ముందుకు సాగమని నిర్దేశిస్తున్నట్లు ఉంటారు. అంతే కాకుండా ప్రతి విగ్రహంలో అంబేడ్కర్ నీలి రంగు కోటులోనే దర్శనమిస్తారు.

అది ఎందుకు అని మీరెప్పుడైనా గమనించారా? ఆ నీలి రంగుకు గల కారణం గురించి ఎప్పుడైనా ఆలోచించారా..? అంబేడ్కర్‌కు నీలం రంగు అంటే చాలా ఇష్టమట. ఆయన వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సందర్భాల్లో ఇదే రంగును వాడారట. అంతేకాదు, ఆకాశం నీలి రంగులో ఉంటుంది. అలాంటి విశాల వాతావరణాన్నే ఆయన కోరుకున్నారట. ఆయన స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకి కూడా నీలి రంగు జెండానే వాడారు. అంతేకాదు, ఆయన విగ్రహాలకు నీలి రంగు కాకుండా ఇతర రంగులు వేస్తే.. వివాదాలకు దారితీసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

ఏడాది పాటు ఆఫీసుకు వెళ్లకుండానే జీతం..!



Next Story

Most Viewed