మగవాళ్లు మొలతాడు ఎందుకు ధరిస్తారో తెలుసా?

by Dishanational2 |
మగవాళ్లు మొలతాడు ఎందుకు ధరిస్తారో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : హిందు స‌నాత ధ‌ర్మంలో అనేక ఆచారాలు, వ్య‌వ‌హారాలు అనాధిగా కొన‌సాగుతూ వ‌స్తున్నాయి. అందులో మగవాళ్లు మొలతాడు కట్టుకోవడం ఒకటి. పుట్టిన తర్వాత ప్రతి అబ్బాయికి మొలతాడు అనేది తప్పనిసరిగా కడుతుంటారు.

అయితే మగవారికి ఎందుకు మొలతాడు కడుతారో ఇప్పుడు చూద్దాం. చాలా మంది ఎక్కువగా నల్లని మొలతాడు కట్టుకుంటుంటారు. ఇలా కట్టుకోవడం వెనుక అనేక లాభాలు ఉన్నాయంట. మొలతాడు కట్టుకోవడం వలన దుష్ట‌శ‌క్తులు త‌మపై ప్ర‌భావం చూప‌ద‌ని నమ్మం.అంతే కాకుండా మొలతాడు కట్టుకోవడం వలన నెగెటివ్ ఎన‌ర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందంట. వీటి కార‌ణంగా అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా, దిష్టి త‌గ‌ల‌కుండా ఉంటుంది అంటారు.అలాగే స్నానం ఆచరించేటపుడు పూర్తిగా నగ్నంగా ఉండకూడదు కనీసం గుడ్డ అయినా ధరించాలి అని వేదాలలో చెప్పినట్లుగా కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. పూర్వకాలంలో అందరూ నదుల్లోనే స్నానం ఆచరించే వారు. ఒక్కోసారి కొన్ని పరిస్థితుల కారణంగా గుడ్డ ఉండకపోవచ్చు. ఈ క్రమంలో మొలతాడు పవిత్రమైనది, కాబట్టి ఎలాంటి పాపం అంటుకోదు అని దీనిని ధరించేవారంట.

ఇవి కూడా చదవండి: స్త్రీలు రెండు కనుబొమ్మల మధ్యే ఎందుకు బొట్టు పెట్టుకుంటారో తెలుసా?

Next Story

Most Viewed