మనదేశంలో ఐదు మిస్టరీ ఆలయాల గురించి మీకు తెలుసా... అవి ఏంటంటే..!

by Disha Web Desk 1 |
మనదేశంలో ఐదు మిస్టరీ ఆలయాల గురించి మీకు తెలుసా... అవి ఏంటంటే..!
X

దిశ, వెబ్ డెస్క్ : అత్యంత పురాతన సంస్కృతి గల మన భారతదేశంలో అంతు చిక్కని రహస్యాలకు కొదువ లేదు. మన పూర్వీకులు చాలా కట్టడాలు ఎలా కట్టారో ఇప్పటికీ తెలియని రహస్యంగానే మిగిలిపోయాయి. అయితే, అలాంటి ఐదు మోస్ట్ మిస్టీరియస్ ఆలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. కోణార్క్ సన్ టెంపుల్ :


ఈ ఆలయాన్ని క్రీ.శ. 1236 నుంచి క్రీ.శ.1264 మధ్య గంగా వంశానికి చెందిన లాంగుల నరసింహదేవా అనే రాజు కట్టించినట్లు అక్కడ దొరికిన కొన్ని ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఆలయాన్ని ఏడు గుర్రాలు 24 చక్రాలు ఉన్నటువంటి రథం ఆకారంలో నిర్మించారు. అయితే ఈ ఆలయంలో కొంత భాగాన్ని 17వ శతాబ్ధంలో కూల్చివేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఆలయంలో కొన్ని టన్నుల బరువుతో పెద్ద అయస్కాంతం ఉండేదని, ఆ అయస్కాంతంతో గుడిలోని విగ్రహాం గాలిలో తేలియాడుతూ ఉండేదని పురణాలు చెబుతున్నాయి. అయితే, అయస్కాంత నిర్మాణాన్ని ఎవరు కూల్చారో, ఎందుకు కూల్చారో అన్న విషయం ఇంత వరకు తెలియదు. అదేవిధంగా గుడిలో ఉండే రాతి చక్రాల్లో ఎంతో విజ్ఞానం దాగి ఉంది, ఎందుకంటే అది సన్ డయల్స్, ఆ సన్ టైల్స్ ఇప్పటికీ ఖచ్చితమైన సమయాన్ని చూపిస్తాయంటూ భారతదేశ నిర్మాణ నైపుణ్యం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు.

2. బృహదీశ్వరాలయం :



తమిళనాడులోని తంజావూరుకి అతి సమీపంలో ఈ గుడిని వేయి సంత్సరాల క్రితం నిర్మించారు. క్రీ.శ.1010లో చోళ వంశానికి చెందిన రాజేంద్ర చోళులు ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ గుడిని కొంజర రాజరాజ్యం అనే వాస్తు శిల్పితో ఆగమశాస్త్రం ప్రకారం నిర్మించినట్లు అక్కడ ఉన్న శాసనాల్లో వెల్లడించారు. గుడిని మొత్తం కొన్ని టన్నుల గ్రైనేట్ రాళ్లతో కట్టినట్లు తెలుస్తోంది. గుడి గాలి గోపురంపై ఉన్న గుండ్రని కట్టడం ఒక్కటే మొత్తం 80 టన్నుల బరువు ఉంటుంది. ఆ గాలి గోపురం ఎత్తు 216 అడుగులు. క్రేన్లు, మెషిన్లు, టెక్నాలజీ లేని ఆ కాలంలోనే అంత బరువైన రాయిని అంత పైన ఎలా పెట్టారో ఇప్పటికీ ఓ పెద్ద మిస్టరీయే.

3. వీరభద్ర ఆలయం :


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా లోని లేపాక్షిలో ఉంది ఈ ఆలయం ఉంది. క్రీ.శ 1530 లలో విజయనగర రాజులు ఆలయాన్ని కట్టించినట్లు అక్కడ ఉన్న ఆధారాలను బట్టి తెలుస్తుంది. ఈ ఆలయంలో మొత్తం 70 స్తంభాలతో ఉంటుంది. అయితే వీటిలో ఒక స్తంభం మాత్రం నేలకు తగలకుండా గాలిలో వేలాడుతూ ఉంటుంది. ఈ వింతను చూసేందుకు చాలా ప్రదేశాల నుంచి ఎంతో మంది టూరిస్టులు ఈ ఆలయానికి వస్తారు. ఎంతో బరువైన ఆ స్తంభం గాలిలో ఎలా వేళాడుతుందో ఎవరికీ తెలియని ఒక రహస్యం. అయితే 1910 లో ఒక బ్రిటిష్ ఇంజనీర్ ఈ వింత స్తంభాన్ని చూసి ఆశ్చర్యపోయి ఆ స్తంభానికి నేలకి మధ్య ఉన్న ఖాళీని ఫిల్ చేసేందకు ప్రయత్నించగా ఆలయ కట్టడం బీటలు వారడం గమనించి ఆ పనిని నిలిపివేశాడు. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో ఓ పెద్ద పాదముద్ర ఒకటి ఉంది. ఈ ముద్ర సుమారు మూడు అలుగుల పొడవు ఉంటుంది. అంత పెద్ద పాదముద్రం ఎవరిది అది అక్కడకు ఎలా వచ్చిందో అనేది కూడా ఆశ్చర్యమే.

4. అనంత పద్మనాభ స్వామి ఆలయం :


కేరళలోని తిరువనంతపురంలో ఉన్న ఈ ఆలయాన్ని ఎవరు కట్టారో, ఎప్పుడు కట్టారో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఆలయంగా పేరుగాంచిన ఈ ఆలయంలో సుమారు 22 బిలియన్ డాలర్లు విలువ చేసే బంగారం మణి, మాణిక్యాలు దొరికాయి. ఆ సంపద మొత్తం గుడి నేలమాలిగలలో ఉన్న కేవలం ఐదు గదులలోంచి తీసినదే. ఇంకా అక్కడ తెరవని మూడు గదులున్నాయి. కానీ, వాటిలో ఒక గది ఇనుప తలుపుపై పెద్ద పెద్ద సర్పాల బొమ్మలతో ఉంది. వాటినే నాగబంధనం అని మన పురాణాలు చెబుతున్నాయి. ఆ తలుపును తీయాలంటే కొన్ని మంత్రాల వల్లే సాధ్యపడుతుందట. అలా కాదని బలవంతంగా తలుపుని తెరవాలని చూస్తే పెద్ద ప్రమాదం జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఇంతకీ ఆ గదిలో ఏముంది ఆ గదికి నాగబంధనం ఎందుకు వేశారనే విషయాలు ఇప్పటికీ ఒక రహస్యంగానే మిగిలిపోయాయి.

5. కైలాస ఆలయం :


మహారాష్ట్రలోని ఎల్లోరా ప్రాంతంలో ఈ ఆలయం ఉంది. ఈ గుడిని ఎప్పుడు కట్టారు, ఎవరు కట్టారు చెప్పేందుకు సరైన ఆధారాలు లేవు. కొంతమంది చరిత్రకారుల లెక్కల ప్రకారం క్రీస్తు శకం ఆరో శతాబ్ధంలో ఆ ప్రాంతాన్ని పాలించిన రాష్ట్ర కూట వంశానికి చెందిన రాజులు కట్టించినట్లు చెబుతున్నారు. ఈ ఆలయం మొత్తం ఒకే రాయితో చెక్కారు. ఈ ఆలయం ఎంత పెద్దదంటే గ్రీస్ దేశంలోని పార్టీల అనే కట్టడం కంటే రెండింతలు పెద్దది. ఈ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా ఫలకంతో చెక్కిన ఆలయం. ఆలయానికి రూపం తీసుకురావడానికి నాలుగు లక్షల టన్నుల రాయిని చెక్కినట్లుగా ఆధారాల ద్వారా స్పష్టమవుతుంది కొన్ని వేల సంవత్సరాల క్రితం కేవలం సుత్తె, ఉలిలతో గొప్ప శిలా సౌందర్యం కలిగిన ఇంత పెద్ద ఆలయాన్ని ఎలా కట్టారు అనేది రహస్యంగా మిగిలిపోయింది.

Read More: దివ్య ఔషధంగా పుదీనా.. ఒకటా, రెండా.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?



Next Story