నీళ్ళని అలా తాగుతున్నారా? అయితే జాగ్రత్త సుమా!

by Dishafeatures1 |
నీళ్ళని అలా తాగుతున్నారా? అయితే జాగ్రత్త సుమా!
X

దిశ,ఫీచర్స్: మన జీవిత కాలంలో నీరు ఎంత ముఖ్య పాత్ర పోషిస్తుందో మన అందరికీ తెలిసిన విషయమే. ఇంకా వేసవి కాలంలో తగినంత నీరు తీసుకోక పోవడం వలన అనేక ఆరోగ్య సమస్యలకు గురి అవుతారు. దీనిలో ముఖ్యంగా శరీరం డీహైడ్రేట్ అవుతుంది. కేవలం శరీర అవయవాలు పని చేయడానికి కాకుండా జుట్టు, చర్మంతోపాటు అన్ని సక్రమంగా పని చేయడానికి ఉపయోగపడుతుంది. మరి ఇంత మంచి పాత్ర పోషిస్తున్న నీరుని ఏ విధంగా తీసుకుంటే మంచిదో మనం ఇప్పుడు చూద్దాం.

*తిన్న వెంటనే నీళ్లు తాగకపోవడమే మంచిది. కొంత నిర్ణీత సమయం తర్వాత మాత్రమే నీరు తాగితే ఆరోగ్యానికి మంచిదట.

*అలాగే చాలామంది నేరుగా రిఫ్రిజిరేటర్ నుంచి నీటిని తాగుతుంటారు.అలా కాకుండా కుండలోని నీరు తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఒక్కసారిగా అత్యంత చల్లగా ఉండే నీటిని తాగకూడదు.

* అలాగే భోజనానికి ముందు లేదా తర్వాత వెంటనే నీరు త్రాగ వద్దు. భోజనానికి కొద్దిసేపటి ముందు నీరు త్రాగాలి.

*బయటికి వెళ్ళి వచ్చినప్పుడు,బాగా అలసిపోయినప్పుడు మనకు అధికంగా దాహం వేస్తుంది. ఆ సమయంలో ఒకేసారి ఎక్కువ నీరు త్రాగ వద్దు. ఇది వాంతులు వంటి సమస్యలను కలిగిస్తుంది. కడుపు నిండా నీళ్లు ఎక్కువగా తాగకపోవడమే మంచిది.

* అంతేకాకుండా మీరు గుర్తుంచుకోవలసిన ప్రధాన విషయం ఏమిటంటే.. ఎప్పుడు పడుకుని నీరు త్రాగకూడదు కూర్చొని మాత్రమే సేవించాలి. ఖాళీ కడుపుతో కూడా ఒకేసారి ఎక్కువ నీరు తాగితే వాంతులు అవుతాయి.


Next Story

Most Viewed