Ren Xiang: హలో నా పేరు రెన్ జియాంగ్ !.. అందరినీ ఆకట్టుకుంటున్న AI- పవర్డ్ న్యూస్ యాంకర్‌

by Disha Web Desk 10 |
Ren Xiang: హలో నా పేరు రెన్ జియాంగ్ !.. అందరినీ ఆకట్టుకుంటున్న AI- పవర్డ్ న్యూస్ యాంకర్‌
X

దిశ, ఫీచర్స్: “హలో.. మై నేమ్ ఈజ్ రెన్ జియారోంగ్ (Ren Xiaorong) నేను AI డిజిటల్ యాంకర్‌ని, ప్రస్తుతం పీపుల్స్ డైలీలో చేరాను. నా అడ్రస్ కేరాఫ్ ఆన్ లైన్ ’’ అంటూ యాంకర్ రెన్ తన గురించి తాను పరిచయం చేసుకోవడం ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చింది. ఆమె మాటలు, అందమైన ఆహార్యం అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అంతేగాక తనకు వేలాది మంది న్యూస్ యాంకర్లు తమ ప్రొఫెషనల్ స్కిల్స్‌ను అందించారని రెన్ వెల్లడించింది. ఇక తాను 365 రోజులు, 24 గంటలు నిరంతరంగా వార్తలు అందిస్తానని పేర్కొన్నది. అసలు విషయం ఏంటంటే ఆ యాంకర్ మనిషి కాదు, AI ద్వారా నడిచే రోబో యాంకర్.

చైనీస్ మీడియా అవుట్‌లెట్ పీపుల్స్ డైలీ ఇటీవల తన న్యూస్ యాంకర్ టీమ్‌లో ఒక వర్చువల్ ఏఐ పవర్ యాంకర్ అయిన రెన్ జియాంగోను ప్రవేశ పెట్టింది. గత ఆదివారం విడుదల చేసిన ఒక వీడియోలో.. ఈ విషయాన్ని స్పష్టం చేసింది. రెన్ జియారోంగ్ అనే వర్చువల్ యువతిని AI ద్వారా నడిచే చాట్‌బాట్‌గా ప్రపంచానికి పరిచయం చేసింది. సదరు రోబోట్ యాంకర్ వేలాది మంది న్యూస్ యాంకర్ల నుంచి స్కిల్స్‌ను నేర్చుకుంది. అంతేగాక ఇది వీక్షకుల అభిప్రాయాల ఆధారంగా నిరంతరం తనను తాను డెవలప్ చేసుకుంటూ, అవసరమైన స్కిల్స్ పెంపొందించుకుంటూ ఉంటుంది. ఈ వర్చువల్ యాంకర్ అందంతోపాటు తెలివైనది. అచ్చం న్యూస్ యాంకర్‌లా దుస్తులు ధరించి హావ భావాలను ఒలికిస్తూ వార్తలు చదువుతుంది. సమాచారం అందిస్తుంది. ఆ వర్చువల్ యువతి మాటలు వింటే ఆమె నిజంగానే మనిషి, అందమైన యువతి అనుకుంటారు. అంత అద్భుతంగా తన బిహేవియర్ ఉంటుంది మరి. యాప్‌ని ఉపయోగించి ఎవరైనా న్యూస్ యాంకర్‌ను స్టడీ, మెడిసిన్, అంటువ్యాధుల నివారణ, గృహనిర్మాణం, ఉపాధి, పర్యావరణ పరిరక్షణ, ప్రపంచంలో మీకు తెలియని విషయం, న్యూస్ ఏదైనా సమాచారం అడగొచ్చు. వెంటనే చెప్పేస్తుంది. అయితే ప్రస్తుతం రొటీన్ ఆన్సర్ మాత్రమే చేయగలదని, ఫ్యూచర్లో మరింత డెవలప్ అవుతుందని చైనీస్ కమ్యూనిస్టు పార్టీ ప్రకటించింది.

మరింత టాలెంటెడ్‌గా..

“న్యూస్ సైట్‌లలో ఉన్నా లేదా స్టూడియోలో తిరుగుతున్నా మీరు నన్ను ఎల్లప్పుడూ చూస్తారు. ప్రతీ డైలాగ్, సెర్చ్, అండ్ మీరు అందించే ఫీడ్ బ్యాక్ వల్ల నేను మరింత టాలెంటెడ్‌గా తయారవుతాను” అని వర్చువల్ న్యూస్ యాంకర్ రెన్ చెప్పుకొచ్చింది. మొదటి చూపులో కచ్చితంగా ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ, రెన్ జియారోంగ్ ప్రస్తుతం ఓపెన్ AI, ChatGPT చాట్‌బాట్ మాదిరి మరీ అంత ట్రెండీగా లేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఉదాహరణకు వర్చువల్ న్యూస్ యాంకర్‌తో ప్రేక్షకులు(Human users’ interaction) ఆన్ లైన్ వేదిక ద్వారానే అయినా ఫేస్ టు ఫేస్ డైలాగ్స్ ద్వారా మాట్లాడే అంశాల్లో పరిమితులున్నాయి.

గతంకంటే భిన్నంగా

అయితే రెన్ జియారోంగ్ చైనాలో తాజాగా సృష్టించబడిన మొదటి AI- పవర్డ్ వర్చువల్ న్యూస్ యాంకర్ కారనప్పటికీ గతంకంటే పర్‌ఫెక్ట్‌గా క్రియేట్ అవడంలో మాత్రం మొదటిది. 2018లో కూడా జిన్‌హువా తన మొదటి వర్చువల్ యాంకర్‌ను ఆవిష్కరించింది. ఆ తర్వాత మరో ఏడాదికి (2019) ఉమెన్ వెర్షన్‌ను(female version) విడుదల చేసింది. అయితే ఇవి త్వరగా డెవలప్ అయి, యాంకర్ స్థానాన్ని భర్తీ చేస్తాయన్న ఆశలు ఫలించలేదు. దక్షిణ కొరియా తయారు చేసిన AI-ఆధారిత యాంకర్ కూడా అంత మెరుగ్గా పనిచేయలేకపోయింది. ప్రస్తుతం చైనా తయారు చేసిన రోబోట్ న్యూస్ యాంకర్ రెయిన్ మాత్రం అంతకంటే సమర్థవంతంగా పనిచేస్తోంది. అయితే రోబోట్ యాంకర్లను ప్రవేశ పెట్టడాన్ని కొందరు విమర్శిస్తున్నారు కూడా ‘‘నేను రోబోట్ న్యూస్ యాంకర్‌ను సమర్థించను. ఎందుకని ప్రవేశ పెడుతున్నారు? ప్రస్తుతం మనుషుల్లో బ్రాడ్ కాస్ట్ యాంకర్ల కొరత ఏమైనా ఉందా? లేదా మనిషికంటే AI యాంకర్లు మెరుగ్గా ఉన్నారా?’’ అని ఒక Weibo వినియోగదారు వ్యాఖ్యానించాడు. ఏఐ ప్రజెంటర్స్ టెక్నోలాజికల్ ప్రోగ్రెస్ కోసం మనీ అధికంగా స్పెండ్ చేస్తున్నారు కానీ కరెక్ట్ కాదని సదరు యూజర్ అభిప్రాయపడ్డాడు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఏఐ ఆధారిత టెక్నాలజీ, ఛాట్ జీపీటీపై ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో చైనీస్ పీపుల్స్ డైలీ ఆవిష్కరించిన ఏఐ ఆధారిత వర్చువల్ యాంకర్ పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

Also Read..

టూత్ బ్రష్ ఎక్కడ పుట్టిందో తెలుసా..? జైలులో



Next Story

Most Viewed