టూత్ పేస్టులతో క్యాన్సర్.. కొనే ముందు ఈ జాగ్రత్త తప్పనిసరి!

by Disha Web Desk 8 |
టూత్ పేస్టులతో క్యాన్సర్.. కొనే ముందు ఈ జాగ్రత్త తప్పనిసరి!
X

దిశ, ఫీచర్స్ : ఉదయం లేచిందంటే చాలు టూత్ పేస్ట్‌తో బ్రెష్ వేయనిదే ఎవరికీ మనసున పట్టదు. ఒకప్పుడు వేపపుల్ల లాంటివి వాడేవారు కానీ ప్రస్తుతం అందరూ టూత్ పేస్ట్‌లనే ఉపయోగిస్తున్నారు. దీంతో మార్కెట్‌లోకి కొత్త కొత్త రకాల టూత్ పేస్ట్‌లు వస్తున్నాయి.

దీంతో కొందరు కొత్తగా ఉంది కదా అని నచ్చిన ప్రతి దాన్ని కొనుగోలు చేసి వాడుతుంటారు. అయితే తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడి అయ్యాయి. టూత్ పేస్ట్ వాడే వారికి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎందుకంటే టూత్ పేస్ట్‌తో మనం బ్రెష్ చేసినప్పుడు నురగ రావడానికి అలాగే, టేస్టీగా కూడా ఉండటానికి వాటిలో సోడియం లారిల్ సల్ఫేట్, డైతనోలమైన్ అనే రసాయనాలను కలుపుతారంట. ఇవి నోటిపూత, ఊబకాయం, క్యాన్సర్, కిడ్నీ, కాలేయం వంటి వ్యాధులకు కారణం అవుతున్నాయని, అందువలన మార్కెట్‌లో టూగ్ పేస్ట్ కొనుగోలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా టూత్ పేస్ట్‌ల మీద రంగులతో కూడిన కొలతలు రాసి ఉంటాయని, తక్కువ రంగు ఉంటే తక్కువ రసాయనం కలిపినట్లు అర్థం. అలాంటి వాటిని కొనుగోలు చేయాలి. ఇంక కొన్ని టూత్ పేస్టులకు బ్లూ మార్క్ ఉంటుంది అది సహజసిద్ధమైన వని రసాయనాలు లేనివి,ఎరుపు రంగు ఉంటే వాటిలో కొంత రసాయనం కలిసినట్లు అని అర్థం చేసుకొని టూత్ పేస్ట్ కొనుగోలు చేయాలంట.

Next Story

Most Viewed