AP News:మా గొంతులు నీటితో తడపండి..మద్యంతో కాదు!

by Disha Web Desk 18 |
AP News:మా గొంతులు నీటితో తడపండి..మద్యంతో కాదు!
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో ప్రత్యర్థులపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇక ప్రచారంలో పార్టీ అభ్యర్థుల వెంట వెళితే తాగినంత మద్యం లభిస్తోంది. ఈ క్రమంలోనే పల్నాడు జిల్లా గుమ్మనంపాడు వాసులు అభ్యర్థులకు చురకలు వేస్తున్నారు. ‘మద్యంతో కాదు నీటితో మా గొంతులు తడపండి’ అనే సందేశాన్ని ఓటర్లు వైరల్ చేస్తున్నారు. నాయకులారా మీకు ఓటు కావాలంటే మాకు నీళ్లు కావాలి. మా పంటలు పండితేనే మీకు ఓట్లు రాలుతాయి అంటున్నారు. ఇది ప్రజెంట్ నెట్టింట తెగ వైరల్‌గా మారింది.

గండిగనుమల, షోలాయిపాలెం, అయ్యన్నపాలెం, చక్రాయపాలెం, గుమ్మనంపాడు, రావులాపురం, గుట్లపల్లి, కండ్రిక, బండ్ల మోటు దిగువ గ్రామాల్లో నీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చింది. ప్రజలు ప్రైవేటు ట్యాంకర్ల నుంచి నీళ్లు రూ.100కు కొనుగోలు చేసుకొవాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో తాగునీటి సమస్యకు తక్షణమే పరిష్కారమే తమ డిమాండ్ అంటూ పార్టీల అభ్యర్థులకు ఈ సందేశం చేరేలా వాట్సాప్‌లో ప్రచారం చేస్తున్నారు.

Next Story

Most Viewed