యువతలో పెరుగుతున్న క్యాన్సర్.. ప్రారంభంలో గుర్తించకపోతే ప్రమాదమేనా?

by Disha Web Desk 8 |
యువతలో పెరుగుతున్న క్యాన్సర్.. ప్రారంభంలో గుర్తించకపోతే ప్రమాదమేనా?
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం రోజు రోజుకు క్యాన్సర్ కేసులనేవి విపరీతంగా పెరుగుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా క్యాన్సర్ అనేది వస్తుందని చెబుతున్నారు నిపుణులు. ప్రారంభంలోనే దీనిని గుర్తిస్తే ఎలాంటి ప్రమాదం ఉండదని, లేకపోతే ప్రాణానికే ముప్పు అని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా యువత ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నట్లు సర్వేలో వెల్లడైంది. యువతలో పేగు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్స్ వారసత్వంగా వచ్చే అవకాశాలు ఉన్నాయంట. అదేవిధంగా మనం తీసుకుంటున్న ఆహారం, జీవనశైలి, పర్యావరణ కారకాలు కూడా యువతలో క్యాన్సర్‌‌ను పెంచుతున్నాయంట. అందువలన యువత ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ మధ్యకాలంలో 45 ఏళ్లలోపు ఉన్న వారు చాలా మంది క్యాన్సర్‌తో పోరాటం చేస్తున్నారంట. కానీ వారు క్యాన్సర్‌ని త్వరగా గుర్తించకపోవడం వలన ప్రాణాల మీదకు తెచ్చకుంటున్నారు. పొత్తికడుపులో విపరీతమైన నొప్పి, మోషన్‌లో బ్లడ్ రావడం, మల బద్ధకం లాంటి సమస్యలతో బాధపడేవారు వెంటనే వైద్యుడిని సంప్రదించాలని వారు చెబుతున్నారు.

ఇక ఇటీవల ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ మిడిల్టన్ క్యాన్సర్‌, వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు చాలా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కాగా, తాను తాజాగా ఓ వీడియోను విడుదల చేసింది. అందులో ఆమె మాట్లాడుతూ.. పొత్తి కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరగా, తనకు క్యాన్సర్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అది ప్రారంభ దశలోనే ఉంది, ఈ మేరకు నేను చికిత్స తీసుకుంటున్నాను అందులో పేర్కొన్నారు.


Next Story

Most Viewed