- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sweet Corn : భోజనం చేసిన తర్వాత మొక్కజొన్న తినొచ్చా..?
కడుపు నిండా భోజనం చేసిన తర్వాత కూడా కొందరికి మళ్ళీ ఆకలి వేస్తుంది.

దిశ, వెబ్ డెస్క్ : మనం ఎంత కష్ట పడినా సమయానికి భోజనం చేయాలి. లేదంటే, ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. కడుపు నిండా భోజనం చేసిన తర్వాత కూడా కొందరికి మళ్ళీ ఆకలి వేస్తుంది. అలా అని మొక్కజొన్నలు ( Sweet corn ) తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. లేత గింజల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. 100 గ్రాముల మొక్క జొన్నల్లో 365 కిలో కెలోరీల శక్తి ఉంటుంది. వీటిలో సెల్యూలోజ్, పీచుపదార్థాలు ఉంటాయి. అవి మన పేగుల్లోని వ్యర్థాలను బయటకు పంపి.. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
షుగర్ తో బాధపడేవారు, బరువు తగ్గాలనుకొనేవారు వీటిని రోజూ వారి డైట్ లో తీసుకుంటే మంచి ఫలితం పొందుతారు. ఇవి గుండె పని తీరును మెరుగుపరుస్తుంది. ఈ గింజల్లో ఉండే నూనెలు చర్మ సమస్యలను తగ్గిస్తాయి. అలాగే, మొక్కజొన్నల పొత్తుల చివరన ఉండే పీచు మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ నల్లటి పీచును ఉడికించి , ఆ వాటర్ ని తీసుకుంటే మూత్రాశయానికి సంబంధించి సమస్యలు తగ్గుతాయి. వీటిని ఏ ఆహార పదార్ధాలతో కలిపి తీసుకోకూడదు. ఒకవేళ తీసుకుంటే వెంటనే గోరువెచ్చటి నీళ్లు తాగాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
తిన్న ఆహారం అరుగుదల లేనివారు.. అనప, బీర, పొట్ల, వంకాయ, వెల్లుల్లి, పచ్చి అరటి, బీన్స్, క్యారెట్, దానిమ్మ, నారింజ, మజ్జిగ వంటి ఆహార పదార్ధాలు తీసుకోవాలి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.






