జంట అరటి పండ్లు తింటే కవలపిల్లలు పుడుతారా?

by Dishanational2 |
జంట అరటి పండ్లు తింటే కవలపిల్లలు పుడుతారా?
X

దిశ, వెబ్‌డెస్క్ : అరటి పండ్లు తినడం చాలా మందికి ఇష్టం ఉంటుంది.అయితే అరటిపండ్లు ఒక్కోసారి జంటగా వస్తుంటాయి. అలా ఉన్న అరటి పండ్లను చూస్తే చాలా మంచిగ అనిపిస్తుంది. అయితే మన పెద్దవారు చెబుతుంటారు జంట అరటి పండ్లు తినకూడదు. అలా తినడం వలన కవలపిల్లలు పుడుతారు అని అంటారు. అయితే ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ చాలా మంది ఈ విషయాన్ని నమ్ముతారు. జంట అరటిపండ్లు తింటే కవలలు పుడతారని భారతీయులే కాదు ఫిలిప్పీన్స్ కూడా నమ్ముతారు. అంటే గర్భిణీ స్త్రీ తన మొదటి మూడు నెలల్లో జాయింట్ అరటిపండు తింటే, ఆమెకు ఖచ్చితంగా కవలలు పుడతారని వాళ్లనమ్మకం.

అలాగే కొందరు కవలలు కావాలని కోరుకుంటారు. కాబట్టి వారు జంట అరటి పండ్లను తింటారు. అయితే ఈ మాట ఎంతవరకు నిజం అనే ప్రశ్న చాలామందిలో మెదులుతోంది నిజానికి, ఒక జత అరటిపండ్లు కవలలను ఉత్పత్తి చేస్తాయనే ఆలోచన శాస్త్రీయంగా ఎక్కడా నిరూపించబడలేదు. అరటిపండు తినడం ఆరోగ్యానికి మంచిది. ఇందులో పోటాషియం ఎక్కువగా ఉండటం వలన గర్భిణీలు తినవచ్చు. అందుకే అరటి పండ్లు తినాలని చెబుతుంటారు. కానీ వీటిని కూడా అతిగా తినకూడదు.

Also Read: రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే.. వీటిని తినాల్సిందే?


Next Story

Most Viewed