రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే.. వీటిని తినాల్సిందే?

by Disha Web Desk 10 |
రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే.. వీటిని  తినాల్సిందే?
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా వచ్చిన తర్వాత నుంచి మన జీవన విధానంలో కొత్త కొత్త మార్పులు వచ్చాయి. రోజంతా యాక్టివ్ గా, ఎనర్జిటిక్ గా ఉండాలంటే.. కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవాలని నిపుణులు వెల్లడించారు. వీటిని మనం రోజు వారీ తినే ఆహారంలో చేర్చుకోవడం వలన రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా రోజంతా యాక్టీవ్ గా ఉంటామట. మనం అనుకున్న పనులు పూర్తి చేయాలంటే.. ఆరోగ్యంగా ఉండడం చాలా అవసరం. కాబట్టి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, క్రోవ్వులు, మినరల్స్ ఉన్న ఆహారం తీసుకోవాలి. ఏ ఆహారం తీసుకుంటే మనం రోజంతా ఉల్లాసంగా ఉంటామో.. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం..

1) అరటిపండు మనకు అన్ని సీజన్ ల్లో దొరుకుతుంది. ఎందుకంటే దీనిలో విటమిన్ B6 అధికంగా ఉంటుంది. ఇది ఆహారాన్ని శక్తిగా మార్చడానికి కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ B6 మీ శరీరం కార్బోహైడ్రేట్లను జీవక్రియ చేయడానికి తోడ్పడుతుంది. అరటి పండ్లలో మెగ్నీషియం నిండుగా ఉంటుంది.

2) పెరుగులో ఫ్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు మేలు చేసే మంచి బ్యాక్టీరియా, ప్రోబయోటిక్స్ పెరుగు వాతావరణానికి మద్దతు ఇస్తుంది.జీర్ణ క్రియలో సహాయపడుతుంది. దీన్ని మీ డైట్ లో చేర్చుకుంటే మీ ఎనర్జీ లెవెల్స్ పడిపోకుండా ఉంటాయి.

3)చియా సీడ్స్ మనందరికీ తెలిసే ఉంటాయి. వీటిలో కార్బో కంటెంట్ , ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచేలా చేస్తాయి.

4) స్టీల్ కట్ వోట్స్ లో కార్బోహైడ్రేట్లు, ఫైబర్ తో సహా డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మన జీర్ణ వ్యవస్థను మెరుగుపడేలా చేస్తుంది. అంతే కాకుండా రోజంతా యాక్టివ్ గా ఉండేలా చేస్తుంది.

Also Read: జంట అరటి పండ్లు తింటే కవలపిల్లలు పుడుతారా?

Next Story

Most Viewed