ముద్దు పెట్టుకుంటే మొటిమలు వస్తాయా?

by Disha Web Desk 10 |
ముద్దు పెట్టుకుంటే మొటిమలు వస్తాయా?
X

దిశ, ఫీచర్స్ : ముద్దు మానసిక ఆరోగ్యాన్ని అందిస్తుంది. వ్యక్తిగత జీవితానికి ప్రయోజనాలను చేకూరుస్తుంది. కానీ కొందరు నోటి ఆరోగ్యం, చర్మానికి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయని భయపడుతుంటారు. ముఖ్యంగా కిస్ వల్ల మొటిమలు వస్తాయనే భయం చాలా మందిని వెంటాడుతుంది. అయితే ముద్దు పెట్టుకోవడం వల్ల నేరుగా మొటిమలు ఏర్పడవని చెప్తున్నారు నిపుణులు. భాగస్వామి చర్మం జిడ్డుగా లేదా మొటిమలతో ఉన్నట్లయితే మాత్రమే బ్యాక్టీరియా, నూనెలు బదిలీ అవుతాయి. చర్మ సమస్యలు తలెత్తుతాయి. లాంగ్ కిస్ సమయంలో అధిక లాలాజలం మార్పిడి కొన్ని సందర్భాల్లో చర్మం చికాకుకు దారితీయవచ్చు. మొత్తానికి మొటిమలు అంటువ్యాధి కాదని.. భాగస్వామి ముద్దు పెట్టుకునే సమయంలో వినియోగించిన లిప్ బామ్ ప్రొడక్ట్ కు రియాక్షన్ గా మొటిమలు రావొచ్చని కూడా చెప్తున్నారు. అంతేకాదు ఒత్తిడి, సరైన ఆహారం తీసుకోక పోవడం, జీన్స్, స్కిన్ గురించి కేర్ తీసుకోక పోవడం, పొల్యూషన్, హార్మోనల్ చేంజెస్ ఇందుకు కారణం అవుతాయని అంటున్నారు నిపుణులు.



Next Story

Most Viewed