Blood Pressure : ఒక్కసారిగా బీపీ తగ్గుతుందా..అయితే, ఈ చిట్కాలు ఫాలో అవ్వండి!

by Disha Web Desk 10 |
Blood Pressure : ఒక్కసారిగా బీపీ తగ్గుతుందా..అయితే, ఈ చిట్కాలు ఫాలో అవ్వండి!
X

దిశ, ఫీచర్స్: ప్రస్తుతం రక్తపోటు సమస్య ఒక సవాలుగా మారింది. మనలో కొందరు అధిక రక్తపోటు, మరికొందరు తక్కువ రక్తపోటుతో బాధ పడుతున్నారు. అధిక రక్తపోటు ఉన్నవారు రోజూ ట్యాబ్లేట్స్ వేసుకుంటూ.. రక్తపోటును అదుపులో పెట్టుకుంటారు. కానీ బీపీ తక్కువగా ఉన్నవారు ఉప్పు కానీ పచ్చళ్లు తింటే మంచిదని చెబుతున్నారు. అయితే దీనిలో ఎంత వరకు నిజం ఉందో ఇక్కడ తెలుసుకుందాం.. మీకు తక్కువ రక్తపోటు ఉన్నట్లయితే ఉప్పు తీసుకోవడం నిజంగా శరీరానికి ప్రయోజనకరంగా ఉంటుందా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఆల్కహాల్ తాగేవారిలో రక్తపోటు ఎక్కువగా ఉంటుందని మనం విన్నాం. ఎందుకంటే అధిక ఆల్కహాల్ తీసుకోవడం డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు రక్తపోటు తగ్గుతూనే ఉంటుంది. అందువల్ల, మీరు ఎక్కువ నీరు త్రాగినప్పుడు, శరీరానికి రక్త ప్రసరణ పెరుగుతుంది. రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది.

బీపీ తక్కువైతే ఏం చేయాలంటే?

తక్కువ రక్తపోటు వలన తరచుగా మైకము, అస్పష్టమైన దృష్టిని కలిగిస్తుంది. కాబట్టి అలాంటి సమయాల్లో హఠాత్తుగా లేచినా ఏదైనా పని చేసినా చికాకుగా ఉంటుంది. కాబట్టి అలాంటి సమయంలో హఠాత్తుగా లేవడం కానీ ఏదైనా చేయడం వల్ల కానీ ఇబ్బంది కలుగుతుంది. ఆ టైమ్ లో ముందుగా కాళ్లను గట్టిగా పట్టుకుని నిలబడాలి. అప్పటికే మంచం మీద పడుకుని ఉంటే పైకిలేచి కాసేపు కూర్చొని ఆ తర్వాత నిలబడాలి.

తక్కువ కార్బోహైడ్రేట్ ఆహారాలు తినండి

మీకు తక్కువ రక్తపోటు ఉన్నట్లయితే, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాలు సిఫార్సు చేయబడవు. కార్బోహైడ్రేట్ ఆహారాలు డయాబెటిస్‌తో ముడిపడివుంటాయి, కాబట్టి అవి నేరుగా గుండెకు హాని కలిగిస్తాయని నిపుణులు అంటున్నారు.

తక్కువ ఆహారం తినండి

తక్కువ రక్తపోటు ఉన్నవారు ఒకేసారి ఎక్కువగా తినకూడదు. అదనంగా, ప్రతి రెండు గంటలకొకసారి తక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవడం వల్ల అలసట, తల తిరగడం పోయి, రక్తపోటును సాధారణ స్థితికి వస్తుంది.



Next Story

Most Viewed