యమ డేంజర్.. కాకరకాయతో కలిపి ఈ ఆహార పదార్థాలు అస్సలు తినొద్దు

by Disha Web Desk 20 |
యమ డేంజర్.. కాకరకాయతో కలిపి ఈ ఆహార పదార్థాలు అస్సలు తినొద్దు
X

దిశ, వెబ్‌డెస్క్ : కాకరకాయ రుచికి చేదైనా.. ఆరోగ్యానికి మాత్రం చాలా మంచిది. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారు కాకరను తింటే కాస్త తగ్గుముఖం పడుతుంది. కాకరకాయ, కాకర రసము, కాకర ఆకులు మందుగా ఉపయోగపడతాయి. కాకర రసంలో " హైపోగ్లసమిక్ " పదార్ధం ఇన్‌సులిన్‌ స్థాయిలో తేడా రాకుండా నియంత్రణ చేస్తూ రక్తంలోని చెక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. కాకర గింజల్లో రక్తంలోని గ్లూకోజ్‌ను తగ్గించే "చారన్‌టిన్‌ " అనే ఇన్సులిన్‌ పదార్ధం ఉంటుంది. కాకరకాయల్లో నీరు శాతం తక్కువగా ఉండి పౌష్టిక శక్తి ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా ఐరన్, జింక్, పొటాషియం, విటమిన్-సి, మాంగనీస్ వంటి పోషకాలు కూడా కాకరలో లభిస్తాయి.

అంతేకాదు మనిషి శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి బరువును తగ్గించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని వైద్యులు చెబుతున్నారు. అందుకే చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కనీసం వారంలో ఒక పూటైనా వారికి కాకరకాయను వండిపెట్టాలి. ఇంతటి పౌష్టికాహారం తీసుకున్న తరువాత కొన్ని ఆహార పదార్థాలను పొరపాటున కూడా తీసుకోకూడదు. ఒక వేళ అలా తీసుకుంటే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే కాకరనాయను తిన్న తరువాత ఏఏ పదార్ధాలను తీసుకోకూడదు ఇప్పుడు చూద్దాం..

బెండకాయ : కాకరకాయను, బెండకాయను కలిపి తీసుకుంటే పొట్టనొప్పి సమస్యలు రావచ్చు.

మామిడికాయలు : వేసవివచ్చిందంటే చాలు.. మామిడిపండ్లను ఆవురావురంటూ తింటారు. ఎప్పుడు తిన్నా ఓకే కానీ కాకరకాయ తిన్నవెంటనే లేదా కాకరకాయ చేదుతో కలిపి అస్సలు తినొద్దంటా. ఇలా తింటే బర్నింగ్ సెన్సేషన్, జీర్ణ సమస్య, ఎసిడిటీ, వికారం ఇలాంటి సమస్యలను ఎదుర్కోవాలి.

పాలు : కాకరకాయ తిన్న వెంటనే పాలను తాగితే మలబద్ధకం, కడుపులో మంట సమస్యలు వస్తాయి. అందకే ఎప్పుడూ కూడా ఈ పొరపాటు చేయవద్దు.

ముల్లంగి : ముల్లంగి చేదు ప్రభావానికి భిన్నంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా కాకరకాయ తిన్న తర్వాత ముల్లంగిని అస్సలు తినకూడదు. దీని కారణంగా గ్యాస్ సమస్యలు, కఫం రావచ్చు.

Also Read..

ఈ విషయం తెలిస్తే మామిడి పళ్లను తినడం ఆపరు..!

Next Story

Most Viewed