- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Health : ఇక దంతక్షయ సమస్యకు శాశ్వత పరిష్కారం..! యాంటీ కావిటీ వ్యాక్సిన్‌ను కనుగొన్న పరిశోధకులు
Health : ఇక దంతక్షయ సమస్యకు శాశ్వత పరిష్కారం..! యాంటీ కావిటీ వ్యాక్సిన్‌ను కనుగొన్న పరిశోధకులు

దిశ, ఫీచర్స్ : ప్రపంచ వ్యాప్తంగా అనేకమందిని వేధిస్తున్న సమస్యల్లో దంతక్షయం (పిప్పి పన్ను) ఒకటి. ఒక రకమైన హానికారక బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే ఆమ్లాలవల్ల పన్ను పాడైపోవడం, బలహీనంగా మారడం, పుచ్చిపోవడం ఈ వ్యాధి లక్షణం. ఇలాంటప్పుడు డెంటిస్టులను సంప్రదిస్తే బ్యాక్టీరియా ప్రభావాన్ని బట్టి రూట్ కెనాల్ చేయడం లేదా దంతాన్ని పూర్తిగా తీసివేయడం వంటి చికిత్సలను అందిస్తుంటారు. దీంతో బాధితులు దంతాలను కోల్పోవాల్సి వస్తుంది. కానీ భవిష్యత్తులో ఇక అలాంటి అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే అసలు దంతాలు పాడయ్యే అవకాశాన్ని ముందుగానే నిరోధించగల యాంటీ కావిటీ వ్యాక్సిన్‌ను పరిశోధకులు డెవలప్ చేశారు.
ఎవరు కనుగొన్నారు?
బయో టెక్నాలజీ రంగంలో అత్యాధునిక పరిశోధనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పరిశోధకులు మానవాళిని వేధిస్తున్న దంతక్షయం సమస్యకు శాశ్వత పరిష్కారంపై చాలా కాలంగా దృష్టి కేంద్రీకరించారు. రీసెంట్‌గా మరో అడుగు ముందుకు వేశారు. ఒకసారి టీకా వేస్తే జీవితాంతం పిప్పి పన్ను సమస్య అనేదే రాకుండా నానోపార్టికల్ ఆధారిత టీకా(nanoparticle-based vaccines)ను అభివృద్ధి చేశారు. దీనినే ‘యాంటీ కావిటీ వ్యాక్సిన్’గా పిలుస్తున్నారు. చైనాలోని జుహై కీ లాబొరేటరీ ఆఫ్ బేసిక్ అండ్ అప్లైడ్ రీసెర్చ్ ఇన్ చైనీస్ మెడిసిన్, అలాగే జున్యి మెడికల్ యూనివర్సిటీ, జుహై క్యాంపస్, గ్వాంగ్‌డాంగ్, చైనా, అండ్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు సంయుక్తంగా ఈ వ్యాక్సిన్‌ను డెవలప్ చేయడంలో కీ రోల్ పోషించారు. ప్రస్తుతం ఇది క్లినికల్ ట్రయల్ దశలో ఉంది.
ఎలా పనిచేస్తుంది?
యాంటీ కావిటీ వ్యాక్సిన్‌ను చిన్నప్పుడు ఒకసారి వేసుకుంటే చాలు. ఇక జీవితాంతం దంత సమస్యలు తలెత్తే అవకాశం ఉండదు. దాదాపు 95% శాతం కచ్చితత్వంతో ఈ వ్యాక్సిన్ పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో బిలియన్ మీటర్లో ఒక వంతు పరిమాణంలో ఉండే చిన్న నిర్మాణాలు, గైడెడ్ మిస్సైల్స్ లాగా పనిచేస్తాని పరిశోధకులు అంటున్నారు. ఇవి స్ట్రెప్టోకాకస్ మ్యూటాన్స్ (Streptococcus mutans) బ్యాక్టీరియా నుంచి కీలకమైన యాంటిజెన్లను నేరుగా రోగనిరోధక వ్యవస్థ కణాలకు చేరవేస్తాయి. సాధారణంగా ఒక పదార్థాన్ని ఇంజెక్ట్ చేయడానికి బదులుగా, ఈ టీకాలు రోగనిరోధక వ్యవస్థను తెలివిగా ఉత్తేజితం చేస్తాయి(Intelligently stimulating). దంత క్షయాన్ని కలిగించే బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా వేగవంతమైన, శక్తివంతమైన, దీర్ఘకాలంపాటు నిలిచే రక్షణను అందిస్తాయి. ఇది నోటిలో ఒక అధునాతన హెచ్చరిక వ్యవస్థ లాంటిదని పరిశోధకులు అంటున్నారు. అయితే ఈ వ్యాక్సిన్ ఇంకా వాణిజ్యపరంగా అందుబాటులోకి రాలేదు. క్లినికల్ ట్రయల్స్ దశ ముగిశాక వచ్చే అవకాశం ఉందని వైద్య రంగ నిపుణులు, పరిశోధకులు భావిస్తున్నారు. అదే జరిగితే ఇక అద్భుతమే మరి.






