ప్రసవం తరువాత విపరీతంగా అలసిపోతున్నారా..! ఇలా చేయండి..

by Disha Web Desk 1 |
ప్రసవం తరువాత విపరీతంగా అలసిపోతున్నారా..! ఇలా చేయండి..
X

దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా గర్భిణులు ప్రసవించిన తరువాత తమ ఒంట్లోని శక్తిని పూర్తి కోల్పోతారు. ముఖ్యంగా మొదతి కాస్పులో ఈ సమస్య ఎక్కువగా కనబడుతుంది. అందుకే ప్రసవించిన వెంటనే తల్లులు తన శక్తి తిరిగి పొందేందుకు గాను తమ డైలీ లైఫ్ లో కొన్ని మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఓపిక లేక అలసటతో బాధపడుతున్న తల్లులకు ఈ చిట్కాలు పాటిస్తే.. వెంటనే తమ శక్తిని పొందుతారు. ఆ అంశాలేంటో.. ఇప్పుడు మనం తెలుసుకుందాం.

వీలైనంత విశ్రాంతి..

నిద్రలేమితో చాలామంది మంది తల్లులు త్వరగా అలసిపోతుంటారు. ఈ నేపథ్యం తమకు దొరికిన కాస్తా సమయాన్ని కూడా బాలింతలు ఎక్కువగా విశ్రాంతికే కేటాయించాలి. బిడ్డ నిద్రపోతున్నప్పుడు ఇతర పనుల్లో నిమగ్నం కాకుండా కాసేపు సేదతీరాలి, బిడ్డ మేల్కొని ఉంటే విశ్రాంతి తీసుకోవడానికి ఏమాత్రం కుదరదు. అందుకే ఎన్ని పనులు ఉన్నప్పటికీ బిడ్డ నిద్రపోతే వారితో పాటే పడుకోవడానికి ప్రధాన్యతనివ్వాలి.

బలవర్ధకమైన ఆహారం

బాలింతలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రధానంగా ఆరోగ్యకరమైన, సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. అన్ని రకాల పోషకాలు, కార్బొహైడ్రేట్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు ఉండే బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకుంటే తల్లులు సత్వర శక్తిని పొందేందుకు వీలుంటుంది. ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తినాలి. బాగా చల్లగా ఉండే పదార్థాలకు మాత్రం దూరంగా ఉండాలి.

గోరువెచ్చిన నీటితో స్నానం, వ్యాయామం

ప్రసవం తర్వాత తల్లి కండరాలు బలహీనంగా మారతాయి. గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే కొంత ఉపశమనంగా అనిపిస్తుంది. శరీరం తేలికగా అనిపిస్తుంది. కాసేపు నడవడం అలవాటు చేసుకోవడం మంచిది. అదేవిధంగా ప్రసవం తరువాత వైద్యులు సూచించే కొన్ని చిన్న చిన్న వ్యాయామాలు కూడా చేయడం వల్ల తల్లులు మానసిక ఒత్తిడి కూడా దూరమవుతుంది.

Next Story

Most Viewed