పీసీఓడీ సమస్యకు చెక్‌పెట్టే ఆహారాలివే !

by Disha Web Desk 10 |
పీసీఓడీ సమస్యకు చెక్‌పెట్టే ఆహారాలివే !
X

దిశ, ఫీచర్స్ : ఈ మధ్య యువతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో పీసీఓడీ, పీసీఓఎస్ ప్రధానంగా ఉంటున్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. హార్మోన్ల అసమతుల్యత వల్ల ఏర్పడే ఈ సమస్య మహిళల్లో మానసిక, శారీరక ఆరోగ్యంపై వ్యతిరేక ప్రభావం చూపుతుంది. దేశంలో 40 శాతంకంటే ఎక్కువమంది మహిళలు పీసీఓడీ సమస్యతో బాధపడుతున్నట్టు ఆరోగ్య నిపుణుల నివేదికలు పేర్కొంటున్నాయి. అంతేకాదు ఇవి సంతానలేమి సమస్యకూ కారణం అవుతాయి. క్రమంగా ఊబకాయం, రుతుచక్రంలో తీవ్రమైన ఇబ్బందులు కూడా ఎదురు కావచ్చు. అయితే కొన్ని రకాల ఆహారాలవల్ల ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని డైటీషియన్లు పేర్కొంటున్నారు. అవేమిటో తెలుసుకుందాం.

బాదం

బాదం అందరికీ తెలిసి డ్రై నట్. ఆరోగ్య సంరక్షణకు ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని మోనో శాచురేటెడ్ ఫ్యాట్ మహిళల్లో హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్‌ను నివారిస్తుంది. పీసీఓడీ వల్ల స్త్రీలలో ముఖంపై ఏర్పడే మొటిమలు, వెంట్రుకలు తగ్గుతాయి. అలాగే మగవారిలో టెస్టోస్టెరాన్ హార్మోనల్ స్థాయిలను తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది.

గుమ్మడి విత్తనాలు

ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల్లో గుమ్మడి ఒకటి. వీటిని ఆహారంగా తీసుకోవడంవల్ల మొటిమలు, జుట్టు రాలడం సమస్యలు తగ్గుతాయి. శరీరానికి కావాల్సిన ఐరన్ లభిస్తుంది. శరీరంలోని హార్మోన్ల పనితీరును నియంత్రించడంలో తోడ్పడుతుంది. ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉండటంవల్ల హార్మోన్ల ఇన్ బ్యాలెన్స్‌ను నివారిస్తాయి.

అవిసె గింజలు

అవిసె గింజలు ఆహారంగా తీసుకోవడంవల్ల పీసీఓఎస్, పీసీఓడీ సమస్యలు తగ్గుతాయి. టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయి బ్యాలెన్స్ తప్పకుండా చేస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచడంలో, రుతు క్రమ ఇబ్బందులను తగ్గించడంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. ఆహారంలో భాగంగా వీటిని చేర్చుకోవడం మంచిది.

కర్పూరం తులసి

కర్పూరం తులసితో తయారుచేసి టీ రోజుకూ రెండు కప్పులు తాగితే మహిళల శరీరంలో వారిని ఇబ్బందికి గురిచేసే పురుష హార్మోన్ అయినటువంటి టెస్టోస్టెరాన్‌ తగ్గుతుంది. బ్లాక్ టీలోలో కూడా దీనిని కలుపుకొని తీసుకోవచ్చు. పీరియడ్ వల్ల ఎదురయ్యే బలహీనత, అలసట, వివిధ సమస్యలను నివారించడంలో కర్పూరం తులసీ బాగా పనిచేస్తుంది.

సాల్మన్ చేపలు

నాన్ వెజ్ రకాల్లో వీటికి ప్రత్యేక స్థానం ఉంది. రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడంవల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. చేపల్లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ టెస్టోస్టెరాన్, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. డయాబెటిస్ రోగుల్లో ఇన్సులిన్ స్థాయిని నియంత్రిస్థాయి. పీసీఓడీ సమస్యలు త్వరగా తగ్గుతాయి.






Next Story

Most Viewed