కుక్కలను అలా అంటే మహా పాపమట.. పూజలు చేసి మొక్కుతున్న ప్రజలు

by Disha Web Desk 13 |
కుక్కలను అలా అంటే మహా పాపమట.. పూజలు చేసి మొక్కుతున్న ప్రజలు
X

దిశ, ఫీచర్స్: కుకుర్ తీహార్.. వినడానికి పేరు కొంచెం కొత్తగా ఉంది కదా. నేపాల్‌లో కుక్కలను ప్రార్థించే పండుగను ఇలా పిలుస్తుంటారు. ఐదు రోజుల తీహార్ ఫెస్టివల్‌లో భాగంగా రెండో రోజున ఈ ప్రత్యేక దినాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ క్రమంలో యముడి దూతలుగా భావించే శునకాలకు స్పెషల్ ప్రేయర్స్ జరుగుతాయి. నుదుట తిలకం, మెడలో పూల దండలతో వాటిని అందంగా ముస్తాబు చేసి.. పాలు, గుడ్లు, మాంసంతో కూడిన డాగ్ ఫుడ్ సమర్పించుకుంటారు. ఈ రోజున ఎవరైనా కుక్క పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తే పాపం గా పరిగణించబడుతుండగా.. కుకుర్ తీహార్‌ను నేపాల్ ప్రవాసులు కూడా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు.


తీహార్ అనేది నేపాల్ నుంచి ఉద్భవించిన ఐదు రోజుల హిందూ ఫెస్టివల్. ఆ దేశంలో ‘దశైన్’ తర్వాత రెండో అతిపెద్ద పండుగ ఇదే. కాగా ఈ సందర్భంగా కుక్కలు, ఆవులు, కాకులు సహా అనేక జంతువులను కూడా పూజిస్తారు.


ప్రాచీన సంస్కృతి ఇతిహాసం మహాభారతంలో స్వర్గానికి వెళుతున్న ఐదుగురు పాండవులు, ద్రౌపది తో పాటు ఒక కుక్క కూడా ఉంది. వీరంతా కలిసి హిమాలయాలను అధిరోహించారు. వీరిలో పెద్ద వాడైన యుధిష్ఠిరుడు, అతని కుక్క తప్ప మిగిలిన వారందరూ దారిలో నశిస్తుంటారు.


అప్పుడు ధర్మరాజు దేవతల రాజు ఇంద్రుడిని కలుస్తాడు. దీంతో అతను స్వర్గానికి స్వాగతిస్తాడు. అయితే తన కుక్కను విడిచిపెట్టమని చెప్పాడు. దీంతో యుధిష్ఠిరుడు తన కుక్క లేకుండా స్వర్గంలోకి ప్రవేశించడానికి నిరాకరించి, తిరిగి భూమిపైకి వెళ్తానని చెప్పాడు. ఈ క్రమంలో కుక్క అదృశ్యమై.. దాని స్థానంలో మృత్యు దేవుడైన యముడు ఉంటాడు. అప్పుడు ఇంద్రుడు అతని చర్యలకు ముగ్ధుడయ్యాడు. అతని నీతి యుధిష్ఠిరుని కి స్వర్గ ద్వారాలను తెరుస్తుంది.


హిందూ పురాణాలలో యముడికి రెండు కుక్కలు శ్యామా, శర్వరా ఉన్నాయి. ఇవి నరక ద్వారాలను కాపాడతాయి. నేపాలీ హిందువులు కుక్కలను పూజించడం ద్వారా మరణాన్ని సానుకూలంగా చూడటం ప్రారంభిస్తారని నమ్ముతారు. ఎందుకంటే వారి అంతిమ యాత్రలో కుక్క వాటిని అనుసరిస్తుంది. నరకంలో హింసకు గురి కాకుండా కుక్కలు తమను కాపాడతాయని విశ్వసిస్తారు. కుక్కలను యమ సహచరులుగా పరిగణిస్తారు. అతనిని సంతోషపెట్టడానికి కుక్కలను పూజిస్తారు.

Next Story