పాలపుంతలో నివాసయోగ్యమైన గ్రహాలు.. మూడింట ఒకవంతు నీరు కూడా!

by Disha Web Desk 10 |
పాలపుంతలో నివాసయోగ్యమైన గ్రహాలు.. మూడింట ఒకవంతు నీరు కూడా!
X

దిశ,ఫీచర్స్: పాలపుంత గెలాక్సీలో వందల మిలియన్ల నివాసయోగ్యమైన గ్రహాలు(planets) ఉన్నాయని ఒక కొత్త అధ్యయనం పేర్కొన్నది. ఇటీవల కెప్లర్ మిషన్ (Kepler Mission) అందించిన టెలిస్కోప్ డేటా ఆధారంగా పరిశోధకులు ఈ విషయాన్ని కన్ఫామ్ చేశారు. అయితే ఈ ప్లానెట్స్ చిన్నగా, చల్లగా, సూర్యుని ద్రవ్యరాశిలో(mass of the Sun)సగం పరిమాణంలో ఉంటాయని వెల్లడించారు. అంతేకాదు పాలపుంతలో మూడింట ఒకవంతు నీరు కలిగిన గ్రహాలు ఉండటంవల్ల అక్కడ జీవానికి అనుకూలమైన వాతావరణం ఉందని చెప్తున్నారు. ఇక్కడి గోల్డిలాక్స్ జోన్‌లోని(Goldilocks zone ) గెలాక్సీ అంతటా మూడింట ఒక వంతు గ్రహాలు మరింత నివాసయోగ్యంగా ఉంటాయని పరిశోధకుల పరిశీలనలో తేలింది. ‘‘నక్షత్ర మండలంలో అనేక స్మాల్ ప్లానెట్స్ ఉండటమేగాక, వాటిపై నీరు లిక్వడ్ రూపంలో ఉంటుందని మేం భావిస్తున్నాం. అందుకే అవి నివాస యోగ్యంగా ఉంటాయి’’అంటున్నారు ఫ్లోరిడా యూనివర్సిటీకి చెందిన పరిశోధకుడు షీలా సాగర్. భవిష్యత్తులో వివిధ గ్రహాలపై జీవ వైవిధ్యాన్ని కనుగొనడానికి, అక్కడ మానవుల నివాసినికి సంబంధించి మరిన్ని పరిశోధనలు కొనసాగించడానికి ఈ అధ్యయనం దోహదం చేస్తుందని పరిశోధకులు పేర్కొంటున్నారు.

Also Read... ‘లో గ్లైసెమిక్ ఇండెక్స్’‌తో డయాబెటిస్‌‌ నివారణ సాధ్యమే

సైబర్ సెక్యూరిటీ నిపుణుల హెచ్చరిక: ఈ యాప్స్ వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేయండి!



Next Story

Most Viewed