‘లో గ్లైసెమిక్ ఇండెక్స్’‌తో డయాబెటిస్‌‌ నివారణ సాధ్యమే

by Disha Web Desk 10 |
‘లో గ్లైసెమిక్ ఇండెక్స్’‌తో డయాబెటిస్‌‌ నివారణ సాధ్యమే
X

దిశ, ఫీచర్స్ : డయాబెటిస్ బాధితులకు రక్తంలో షుగర్ లెవల్స్ పెరగడానికి, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణం సరైన ఆహార నియయాలు పాటించకపోవడమేనని నిపుణులు చెప్తున్నారు. కొందరు ఆరోగ్యానికి మంచిదని కార్బో హైడ్రేట్లు కలిగిన ఆహారాలు, పలు రకాల పిండి పదార్థాలు తీసుకుంటుంటారు. కానీ వీటిలో ‘గ్లైసెమిక్ ఇండెక్స్’ను పరిగణనలోకి తీసుకోరు. దీనివల్ల సమస్య జఠిలమవుతుంది. కాబట్టి సరైన ఇండెక్స్ మెయింటెన్ చేయడం దీనికి చక్కటి పరిష్కారంగా చెప్పవచ్చు.

ప్రస్తుతం భారతదేశంలో మధుమేహంతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అందుకే మన దేశం ‘డయాబెటిక్ క్యాపిటల్’గా పిలువబడుతోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఏటా 77 మిలియన్ల మంది ప్రజలు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. నిజానికి డయాబెటిస్ అనేది శరీరాన్ని పూర్తిగా లేదా పాక్షికంగా గ్లూకోజ్‌ని ఉపయోగించకుండా నిరోధించే క్రానిక్ మెటబాలిక్ డిజార్డర్(chronic metabolic disorder) అని నిపుణులు పేర్కొంటున్నారు. రక్తంలో పెరిగిన గ్లూకోజ్ లెవల్స్, కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్ యొక్క జీవక్రియలో మార్పుల ద్వారా ఇది వర్గీకరించబడుతుంది. ఇన్సులిన్ స్రావం లేదా ఇన్సులిన్ చర్యలో అసాధారణత కారణంగా మధుమేహం ప్రభావం చూపుతుంది. పెరుగుతున్న అర్బనైజేషన్, హై కేలరీస్, హైలీ రిఫైన్డ్ అండ్ లో ఫైబర్ ఆహారాలు తీసుకోవడం, అలాగే శారీరక శ్రమ లేని జీవన శైలి, అధిక బరువు వంటివి కూడా దీని పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి.

హెల్తీ ఈటింగ్స్

డబ్ల్యుహెచ్‌వో ప్రకారం.. 80 శాతం డయాబెటిస్‌ను హెల్తీ ఈటింగ్స్, ఫిజికల్ యాక్టివిటీస్ కలిగి ఉండటంవల్ల, అలాగే పొగాకు, మద్యపానానికి దూరంగా ఉండటం ద్వారా నివారించవచ్చు. ఇక డయాబెటిస్ బాధితులు క్రమం తప్పకుండా ఆరోగ్య కరమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఇన్సులిన్ లేదా యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ తీసుకునేవారికి ఇది చాలా ముఖ్యం. సాధారణం కంటే తక్కువ తినడం, ఆలస్యంగా తినడం లేదా భోజనాన్ని విస్మరించడం వంటివి హైపోగ్లైసీమియాకు(Low blood glucose levels) దారితీస్తాయి.

ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి

రక్తంలో షుగల్ లెవల్ అనేది ప్రధానంగా కార్బోహైడ్రేట్ల తీసుకోవడంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి బాధితులు తమ రోజువారీ అవసరాలకు అనుగుణంగా పిండి పదార్థాలను తీసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం కూరగాయలు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలతో తృణ ధాన్యాలు, పప్పులు, మిల్లెట్స్ వంటివి తీసుకోవాలి. దీంతోపాటు లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాలపై దృష్టి పెట్టాలి. వందశాతం గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన ఆహారంతో షుగలర్ లెవల్స్‌ పెరుగుతాయి. అందుకే 55 శాతం కంటే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు మాత్రమే తీసుకోవడం ద్వారా షుగర్ వ్యాధివల్ల తలెత్తే అనారోగ్య ప్రభావాలను నివారించవచ్చని నిపుణులు చెప్తున్నారు.

Read Mores: పాలపుంతలో నివాసయోగ్యమైన గ్రహాలు.. మూడింట ఒకవంతు నీరు కూడా!

Next Story

Most Viewed