హనుమంతుడు ఇప్పటికీ బతికే ఉన్నాడు.. వైరల్ అవుతోన్న ఫోటో?

by Disha Web Desk 8 |
హనుమంతుడు ఇప్పటికీ బతికే ఉన్నాడు.. వైరల్ అవుతోన్న ఫోటో?
X

దిశ, ఫీచర్స్ : హనుమంతుడు అంటే చాలా మందికి ఇష్టం. ఈయనను భక్తిశ్రద్ధలతో పూజిస్తే కష్టాలు, భయాలు తొలగిపోయి వారి ఇంట్లో సంతోషాలు వెల్లివిరుస్తాయి అంటారు పండితులు. అంతే కాకుండా ఆంజనేయస్వామి ఎంతో నిష్టగా పూజిస్తుంటారు. ఇక హనుమంతుని చరిత్ర చదివితే ఏదో తెలియని ఆనందం కలుగుతుంటుంది. ఆయన చేసిన సాహసాలు, సీత,రాములను కలపడానికి ఆయన పడిన పాట్లు ఎంతో ఆదర్శ దాయకం. ఇక ఆంజనేయస్వామి త్రేతాయుగంలో అంజనీ దేవి, కేసరికి జన్మించాడని, ఈయన కోతి రూపంలో ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా హనుమంతుడు మనుషుల్లోనే ఓ ప్రత్యేక జాతికి చెందిన వ్యక్తిగా రామాయణంలో ఉంటుంది.

ఇక హనుమంతుడి గురించి ఎన్నో పురాణాలు వచ్చినా, కానీ ఆయన తన అవతారాన్ని చాలించినట్లు ఎక్కడా లేదు. అంతే కాకుండా కొన్ని పురాణాల్లో కలియుగంలో కూడా హనుమంతుడు ఉంటాడని చెప్పబడింది. ఈ నేపథ్యంలోనే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఒక వ్యక్తి మానసరోవర్ యాత్ర చేస్తున్న సమయంలో అతనికి హనుమంతుడి దర్శనం కలిగిందంట. దీంతో ఆయన ఆంజనేయస్వామి చిత్రాన్ని కెమెరాలో బంధించిన తర్వాత అతను చనిపోయినట్లు సమాచారం. కాగా, అతని స్నేహితులు ఆ కెమెరాలోని ఫోటోను డెవలప్ చేసి హనుమంతుడి చిత్రాన్ని కనుగొన్నారు. వయసు మీద పడిన ఓ వానరం పురాణ గ్రంథాలు చదువుతున్నట్లు ఉండే చిత్రాన్ని మనము ఇంటర్నెట్‌లో చూడవచ్చు. అదే హనుమంతుడి రియల్ ఫోటో అని చాలా మంది నిర్ధారణకు వచ్చారు. అప్పటి నుంచి హనుమంతుడు చనిపోలేదు, ఇంకా బతికే ఉన్నాడు, మానసరోవర్ నది ప్రాంతం పర్వతాల్లో ఉన్నాడని భక్తుల నమ్మకం.

Next Story