Viral news : 99 ఐఫోన్లు గిఫ్టుగా ఇస్తూ లవ్ ప్రపోజ్ చేసిన యువకుడు.. చివరికి ఆమె ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

by Javid Pasha |

Viral news : 99 ఐఫోన్లు గిఫ్టుగా ఇస్తూ లవ్ ప్రపోజ్ చేసిన యువకుడు.. చివరికి ఆమె ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Viral news : 99 ఐఫోన్లు గిఫ్టుగా ఇస్తూ లవ్ ప్రపోజ్ చేసిన యువకుడు.. చివరికి ఆమె ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
X

దిశ, ఫీచర్స్ : నచ్చిన వ్యక్తిని ప్రేమించడానికి యువతీ యువకులు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అవతలి వ్యక్తికి ఏం నచ్చుతుందో, ఎలా అయితే తమ ప్రేమను అంగీకరిస్తారో తెలుసుకోవడానికి తెగ ఆరాట పడుతుంటారు. అబ్బాయిలైతే మనసుకు నచ్చిన అమ్మాయిని మెప్పించడానికి పడరానిపాట్లు పడుతుంటారు. వెరైటీగా ప్రపోజ్ చేసి మనసు దోచుకోవాలని కూడా కొందరు భావిస్తుంటారు. అలాంటి సంఘటనకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఆ వివరాలేంటో చూద్దా పదండి.

వైరల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం.. చైనాలోని గ్వాంగ్‌జౌకు ఓ యువకుడు కొంతకాలంగా ఓ యువతిపై మనసు పారేసుకున్నాడు. అందరిలా వెళ్లి ‘I love you’ చెప్తే ఏం బాగుంటుంది. రోటీన్‌కు భిన్నంగా ప్రపోజ్ చేసి ఆమె ప్రేమను దక్కించుకోవాలని భావించాడట. అందుకోసం అతను తన రెండేండ్ల జీతం మొత్తం అంటే సుమారు 5,00,000 యువాన్లు($82,000), అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 5,775,000 ఖర్చు చేశాడు.

ఇంతకీ ఆ యువకుడు ఏం చేశాడంటే.. తన రెండేండ్ల జీతం డబ్బులతో మొత్తం 99 ఐఫోన్లు(iPhones) కొనుగోలు చేశాడు. ఒక పబ్లిక్ పార్కులో వాటిని హృదయాకారంలో(Love symbol) పేర్చి, తను ప్రేమిస్తున్న అమ్మాయి అక్కడి రాగానే తన స్నేహితులు, పార్కులోని ప్రజలందరి సమక్షంలో ప్రపోజ్(Love proposal) చేశాడు. ఇది చూసి ఆ అమ్మాయితోపాటు అందరూ ఆశ్చర్యపోయారు. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఇంత వెరైటీగా ప్రపోజ్(Propose as a variety) చేసినా ఆ అమ్మాయి మాత్రం ఇతని ప్రేమను అంగీకరించలేదు. అందుకే అంటారు పెద్దలు ప్రేమకు డబ్బు, ఆడంబరాలు, వెరైటీలకంటే మనసు ముఖ్యమని. మనసుకు నచ్చినవారినే ఎవరైనా ప్రేమిస్తారని. ఈ విషయాన్ని యువత అర్థం చేసుకుంటే ఇబ్బందులుండవని నిపుణులు సూచిస్తు్న్నారు.

Next Story