ఇంట్లో ఉమెన్ స్పెషల్ స్పాట్.. బాల్కనీతో మీ కనెక్షన్ ప్రత్యేకమే కదా..!!

by Disha Web Desk 13 |
ఇంట్లో ఉమెన్ స్పెషల్ స్పాట్.. బాల్కనీతో మీ కనెక్షన్ ప్రత్యేకమే కదా..!!
X

దిశ, ఫీచర్స్: ఆ ప్రదేశమంటే వారికెంతో ఇష్టం. అదే వారి నేచర్. తమకంటూ స్పెషల్‌గా టైమ్ స్పెండ్ చేసేది, రిలాక్స్ అయ్యేది, బయటి ప్రపంచంతో కనెక్ట్ అయ్యేది కూడా అక్కడే. ఒక విధంగా చెప్పాలంటే అనేకమంది భారతీయ గృహిణుల జీవితంలో విడదీయలేని అనుబంధాన్ని పెనవేసుకుంది ఇంటి బాల్కనీ. తరచూ బిజీగా ఉండే హోం మేకర్స్ బయటి ప్రపంచాన్ని చూడగలిగే కిటికీలాగా పనిచేస్తుంది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా మహిళలు ఏదో సందర్భంలో తమకంటూ కొన్ని క్షణాలు కేటాయించుకునేది బాల్కనీలోనే.

ఇంట్లో బోర్ కొట్టినప్పుడు పొరుగువారితో ముచ్చట పెట్టేందుకు, సోషల్ లైఫ్ కనెక్ట్ అయ్యేందుకు ఇది దోహదపడుతోంది. తీరిక వేళల్లో వెదురు ఊయల మీద కూర్చుని సంగీతం వినడం నుంచి ప్రకృతిని ఆస్వాదిస్తూ ఒక కప్పు కాఫీ తాగడం వరకు బాల్కనీయే వారి ప్రత్యేక స్థలం. వారు రిలాక్స్‌గా భావించే అనువైన ప్రదేశం.


అందరికంటే ముందుగా నిద్ర లేవడం, వంట చేయడం, పిల్లల్ని బడికి పంపడం, భర్తను పనికి పంపడం, ఇంటి పనులు ముగించడం, పిల్లల్ని స్కూల్‌కి చేర్చడం, హోం వర్క్‌లో సహాయం చేయడం, రాత్రి భోజనం రెడీ చేయడం ఇలా రకరకాల బాధ్యతలతో హోం మేకర్స్ జీవితం ముడిపడి ఉంటుంది. మన దేశంలో ప్రబలంగా ఉన్న జెండర్ రోల్స్ మూస పద్ధతులు ఇంటి పనులు, సంతాన సాఫల్యాన్ని మహిళలకు మాత్రమే అంటగడుతున్నాయి.


శ్రామిక మహిళలు పనికి వెళ్లేటప్పుడు కనీసం బయట అడుగు పెట్టగలుగుతున్నారు కానీ ఇప్పటికీ కొంతమంది గృహిణులకు బయటకు వెళ్లే అవకాశం నిరాకరించబడుతోంది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ 2019లో ‘టైమ్ యూజ్’ పేరుతో చేసిన సర్వేలో 50% మంది భారతీయ పట్టణ మహిళలు ఎప్పుడూ తీరికలేని ఇంటి పనుల కారణంగా రోజుకు ఒక్కసారికూడా ఇంటి నుంచి బయటకు వెళ్లడం లేదట. ఇది వారి మానసిక, శారీరక ఆరోగ్యానికి హాని కలిగించడంతోపాటు సోషల్ లైఫ్‌ను కిల్ చేస్తోంది. అలాంటి స్విచ్యువేషన్‌లో ఎంతోమంది మానసిక ఆరోగ్యానికి, ఆనందానికి అనువైన ప్రదేశంగా విలసిల్లుతోంది బాల్కనీ.

Read more:

చిన్న వయసులోనే పెద్ద రెస్పాన్సిబిలిటీస్



Next Story