వేసవిలో ఆరోగ్యంగా ఉండాలా.. ఈ 4 తప్పులు అస్సలే చేయకూడదు!

by Disha Web Desk 8 |
వేసవిలో ఆరోగ్యంగా ఉండాలా.. ఈ 4 తప్పులు అస్సలే చేయకూడదు!
X

దిశ, ఫీచర్స్ : సమ్మర్ వచ్చిందంటే చాలు చాలా మంది డీ హైడ్రేషన్ తో బాధపడిపోతుంటారు. కాస్త దూరం నడవడానికి కూడా అలసిపోతుంటారు. ఇక సమ్మర్ వేడి, ఉక్కపోత భరించలేక పోవడం వలన చాలా మంది తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటారు. కాగా సమ్మర్‌లో అస్సలే చేయకూడని నాలుగు తప్పులు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

  • సమ్మర్ చ్చిదంటే చాలా ప్రతి ఒక్కరూ చల్లటి వాటర్ తాగడానికి ఇష్టపడుతుంటారు.ఎండలో బయటకు వెళ్లి వచ్చి, ఫ్రిడ్జ్‌లో నుంచి కూల్ కూల్ వాటర్ తాగుతారు. అయితే అది ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదంట, వేసవి కాలంలో ఎక్కువగా కుండలో నీరు తాగాలి. అది కుదరకపోతే, ఫ్రిడ్జ్‌లో వాటర్ తాగడానికి ముందు సాధారణ నీరు గ్లాస్ తాగిన తర్వాత ఫ్రిడ్జ్‌లో వాటర్ తాగాలంట.

  • వేసవి వచ్చిందంటే చాలు పదే పదే నాలుక తడి ఆరిపోయినట్లు అనిపించడం. దాహంగా అనిపించడం జరుగుతుంది. అంతే కాకుండా డీ హైడ్రేషన్‌కు గురి అవుతుటాం. అందువలన శరీరం హైడ్రేట్‌గా ఉండటానికి ఎక్కువగా నీరు తాగుతూ ఉండాలి. వీలైతే నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, మజ్జిగ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది.

  • సమ్మర్‌లో అస్సలే స్పైసీ ఫుడ్ తినకూడదు. దీని వలన అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువలన వేసవిలో స్పైసీ ఫుడ్‌కు ఎంత దూరం ఉంటే అంత మంచిది అంటున్నారు వైద్యులు.

  • వేసవిలో పదే పదే చెమటలు వస్తుంటాయి. దీంతో శరీరం జిడ్డుగా మారుతుంది. అందువలన రోజూ రెండు సార్లు స్నానం చేయడం వలన ఆరోగ్యంగా ఉండటమే కాకుండా శరీరంపై బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా ఉంటుందంటున్నారు నిపుణులు.


Read More..

బంపర్ ఆఫర్ ప్రకటించిన హోటల్.. అతి తక్కువ ధరలోనే 50 రకాల వంటకాలు!


Next Story

Most Viewed