బంపర్ ఆఫర్ ప్రకటించిన హోటల్.. అతి తక్కువ ధరలోనే 50 రకాల వంటకాలు!

by Disha Web Desk 9 |
బంపర్ ఆఫర్ ప్రకటించిన హోటల్.. అతి తక్కువ ధరలోనే 50 రకాల వంటకాలు!
X

దిశ, ఫీచర్స్: రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనది. ముస్లింలంతా నెల రోజుల పాటు కఠిన ఉపవాసాలు చేస్తూ.. రోజుకు ఐదు సార్లు ప్రార్థనలు చేస్తారు. రంజాన్ నెల స్టార్ట్ అయ్యిందంటే చాలు.. ప్రతి ఒక్కరికీ ముందుగా గుర్తొచ్చేది హలీం. ఈ నెలలో చాలా మంది హలీం తినేందుకు ఇష్టపడుతారు. ఇప్పుడు రంజాన్ మాసం కావడంతో హైదరాబాదు నగరంలో ఎక్కడ చూసిన హలీం బట్టీలు దర్శనమిస్తున్నాయి.

చికెన్, మటన్ తోనే కాకుండా ఈ హలీం ను ఎన్నో రకాలుగా తయారు చేస్తున్నారు. జాఫ్రానీ, బాదమీ, వెబ్, హరీస్ లాంటి వెరైటీ హలీంలు రెడీ చేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి యువత పెద్ద సంఖ్యలో వస్తున్నారు. కాగా జనాలు ఎగబడి మరీ హలీం తింటున్నారు. కొన్ని చోట్ల ఫ్రీగా కూడా హలీం పంచిపెడుతున్నారు.

అయితే రంజాన్ సందర్భంగా హైదరాబాదులో శంషాబాద్ లోని ఓ హోటల్ స్పెషల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ. 999 తోనే ఏకంగా 50 రకల వంటకాలను సెహరీలో అందుబాటులో ఉంచారు. ఇంత తక్కువ రేటుకే అన్ని ఐటెమ్స్ ఇస్తుండటంతో ప్రజలు ఆ హోటల్ కు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. ఇక్కడికి కేవలం ముస్లింలే కాకుండా ఇతరులు కూడా ఫుడ్ తినేందుకు వెళ్తున్నారు. అలాగే నైట్ షిఫ్ట్స్ చేసే ఐటీ ఉద్యోగులు ఈ హోటల్ ఫుడ్ ను ఆస్వాదిస్తున్నారు. ఈ హోటల్ మరో ప్రత్యేకత ఏంటంటే? హైదరాబాద్ లో ఈ సెహరీ బఫ్ ను ఫస్ట్ పరిచయం చేసింది ఈ హోటలేనట.

Read More..

పెదాలు నల్లగా మారుతున్నాయా.. ఈ నూనెను రాసుకుంటే గులాబీ రంగులోకి మారతాయట..


Next Story

Most Viewed