గిరిజనుల మీదనే ఆ కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి- లీగల్ ఎయిడ్ కౌన్సిలర్

by  |
గిరిజనుల మీదనే ఆ కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి- లీగల్ ఎయిడ్ కౌన్సిలర్
X

దిశ, మంగపేట: గిరిజనులు కేసుల విషయంలో రాజీమార్గం అనుసరించడమే రాజ మార్గమని జిల్లా లీగల్ ఎయిడ్ కౌన్సిలర్ రంగోజు బిక్షపతి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని గంపోనిగూడెం గిరిజన హాబిటేషన్ లో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లీగల్ అవేర్నెస్ క్యాంపుకు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. అడవులలో విచ్చలవిడి పోడుసాగు వల్ల అనార్థాలు ఏర్పడతాయని, అటవీ జంతువులు తిరిగే అడవులను నరికితే నాన్ బెయిలబుల్ కేసులు నమోదవుతాయన్నారు. ఇలాంటి కేసుల్లో ఎక్కువగా ఆదివాసీ గిరిజనులు ఉండడం ఆందోళన కలిగించే విషయమని, పోడు కేసుల్లో ఒకటి రెండుకు మించి కేసులు నమోదైతే పీడీ యాక్టు కింద కేసులు నమోదై కుటుంబాలు తీవ్రంగా నష్టపోతారన్నారు. నల్లబెల్లం, పటిక వంటి ప్రభుత్వ నిషేదిత వస్తువులతో గుడుంబా తయారు చేయడం కూడా నేరమన్నారు. ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు దూరంగా ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలతో అభివృద్ధి చెందాలన్నారు.

బాల్య వివాహాలు గిరిజన తెగల్లో ఎక్కువగా నమోదైతున్నందున వాటి కట్టడికి గిరిజనుల్లో చైతన్యం తెచ్చేలాగా చదువుకున్న యువత అవేర్నెస్ క్యాంపులు నిర్వహించాలన్నారు. అక్షరాస్యత వైపు గిరిజనులు దృష్టి పెట్టాలని, ఫలితంగా పిల్లలు విద్యావంతులైతే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయన్నారు. గిరిజనులను అడ్డుపెట్టుకుని కొందరు పోడు భూములు నరుకుతూ, గిరిజనులపై కేసుల నమోదుకు ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి చర్యల వల్ల గిరిజనులపై పదే పదే కేసులు నమోదవుతున్నాయని, దాని వల్ల ఇబ్బందులు వస్తాయన్నారు. ఇతరుల వల్ల వచ్చే కేసుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, చట్టాల పట్ల అగాహన కలిగి వాటి పరిధిలో నడుచుకోవాలని ఫలితంగా ఐపీఎస్ 498 సెక్షన్ కేసులు నమోదు కాకుండా చూసుకోవాలన్నారు. అనంతరం మన్యసీమ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గొప్ప వీరయ్య, ఏఎస్సై మల్లెల అబ్బయ్యలు మాట్లాడారు. కార్యక్రమంలో గిరిజన కుల పెద్దలు గాదె సమ్మయ్య, పూనెం సూరయ్య, మల్కం రుక్మిణి, మహిళలు, యువకులు పాల్గొన్నారు.


Next Story