- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోర్టు ఎదుట నగ్నంగా లాయర్ ఆందోళన..
<p>దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ వలన కోర్టు పనులకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న ఓ న్యాయవాది తనకు జీవనాధారం కల్పించాలంటూ కోర్టు ఎదుట నగ్నంగా ఆందోళనకు దిగాడు. ఈ ఘటన తమిళనాడులోని విరుదునగర్ జిల్లా సాత్తూరు వెలుగులోకివచ్చింది. వివరాల్లోకివెళితే.. ఆండాళ్‌పురానికి చెందిన మణికంఠన్ (36) ఉమ్మడి కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్ కారణంగా కోర్టు వ్యవహారాలు నిలిచిపోవడంతో ఆర్థికంగా పలు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దీంతో ఏం చేయాలో […]</p>

దిశ, వెబ్‌డెస్క్ :
కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ వలన కోర్టు పనులకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న ఓ న్యాయవాది తనకు జీవనాధారం కల్పించాలంటూ కోర్టు ఎదుట నగ్నంగా ఆందోళనకు దిగాడు. ఈ ఘటన తమిళనాడులోని విరుదునగర్ జిల్లా సాత్తూరు వెలుగులోకివచ్చింది. వివరాల్లోకివెళితే.. ఆండాళ్‌పురానికి చెందిన మణికంఠన్ (36) ఉమ్మడి కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్ కారణంగా కోర్టు వ్యవహారాలు నిలిచిపోవడంతో ఆర్థికంగా పలు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని మణికంఠన్ సాత్తూరు మెయిన్ రోడ్డులో ఉన్న కోర్టు ఎదుట నగ్నంగా కూర్చుని ఆందోళనకు దిగాడు.
తనకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కోర్టు వద్దకు చేరుకుని మణికంఠన్‌కు సర్దిచెప్పి ఆందోళన విరమింపజేశారు. తన సమస్యకు పరిష్కారం చూపించకపోతే శుక్రవారం ఆమరణ దీక్షకు దిగుతానని లాయర్ హెచ్చరించాడు.






