రైతులకు శుభవార్త: ఈ తేదీ లోపు అకౌంట్ లో డబ్బులు

by Disha Web Desk 17 |
రైతులకు శుభవార్త: ఈ తేదీ లోపు అకౌంట్ లో డబ్బులు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది రైతులకు పంట పెట్టుబడి సాయంగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం కింద రూ. 6000 ఇస్తోంది. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా రూ. 2000 చొప్పున రైతుల అకౌంట్లో వేస్తుంది. ఇప్పటికే 10వ విడత డబ్బులను వారి అకౌంట్లలో జమ చేసింది. గత ఏడాది ఏప్రిల్-జూలై కి సంబంధించిన వాయిదా మే 15న రైతుల ఖాతాలో జమ అయ్యాయి. 11వ విడత ఈసారి ఆలస్యమైంది. పీఎం కిసాన్ నిధి కోసం దేశవ్యాప్తంగా 12.5 కోట్ల మంది రైతులు నమోదు చేసుకున్నారు. 11వ విడత లోపు ఈ-కేవైసీ ని ప్రతి ఒక్కరు పూర్తి చేయాలని ప్రభుత్వం చెప్పింది. ఇంతకుముందు e-KYC కి చివరి తేదీ మార్చి 31, కానీ ఇప్పుడు దానిని మే 31 వరకు పొడిగించారు. అర్హులైన రైతులకు ప్రభుత్వం మే 31 నాటికి PM-KISAN 11వ విడత రూ. 2000 లను వారి అకౌంట్ లో వేయనుంది. కానీ దీనికి తప్పనిసరిగా e-KYC పూర్తి చేసి ఉండాలి.


Next Story

Most Viewed