వ్యవసాయ రంగం నుంచి వాళ్లను వెళ్లగొట్టాలి

by  |
వ్యవసాయ రంగం నుంచి వాళ్లను వెళ్లగొట్టాలి
X

దిశ, భైంసా: వ్యవసాయ రంగం నుండి కార్పొరేట్ లను వెళ్లగొట్టాలని అఖిల భారత రైతు కూలి సంఘం నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు డిమాండ్ చేశారు. ఆగస్టు 9 క్విట్ ఇండియా పిలుపు స్ఫూర్తితో దేశ వ్యవసాయం నుండి కార్పొరేట్ లను వెళ్లగొట్టాలని దేశవ్యాప్త నిరసన కార్యక్రమంలో భాగంగా ఆదివారం భైంసా మండలంలోని హంపోలి, కుంసార, బోరీగం, వట్టోలి గ్రామాలలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధానంగా కరోనా కల్లోలం నేపథ్యంలో పేదలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలు మరచిపోయి తమ స్వార్థం కోసం తమ కార్పొరేట్లకు సేవ చేయడానికి వ్యవసాయ రంగాన్ని అప్పజెప్పడానికి పూను కుంటున్నాయని ఆరోపించారు.

హాస్పిటల్స్ లలో తగిన సౌకర్యాలు కల్పించడంలో, సిబ్బందిని నియమించడంలో, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర ఇవ్వడంలో విఫలం చెందారని మండిపడ్డారు. రైతు రుణాలు మాఫీ చేయడం లేదు కాబట్టి ప్రతి పేద కుటుంబానికి నిత్యావసర సరుకులను అందజేయాలని, కరెంటు బిల్లు మాఫీ చేయాలని, వ్యవసాయ రంగానికి నష్టం చేసే కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గాయక్వాడ్ గంగాధర్, డివిజన్ నాయకులు దీనాజి, గంగారాం, విఠల్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed