చంద్రబాబు వారసుడు పవన్ కల్యాణ్.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

by  |   ( Updated:2021-10-01 06:11:05.0  )
ysrcp leader lakshmi parvathi
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు రాజకీయ వారసుడు లోకేష్ కాదని, పవన్ కల్యాణ్ అని ఆరోపించారు. చంద్రబాబు వారసుడు ఎవరో త్వరలో తేలబోతుందని, టీడీపీ రాసిచ్చే స్క్రీప్ట్‌నే పవన్ చదువుతున్నారని విమర్శించారు. తెలుగు అకాడమీలో నిధుల గోల్‌మాల్‌పై టీడీపీ, జనసేన నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని లక్ష్మీపార్వతి చెప్పారు. తెలంగాణలో దుర్వినియోగం అయిన నిధులకు ఏపీకి ఏం సంబంధమని ప్రశ్నించారు. తెలుగు భాషను బ్రతికించేది వైసీపీ ప్రభుత్వమేనని తెలిపారు.

Advertisement

Next Story