కరోనాను ఎదుర్కొనేందుకు లక్ష్మీ మిట్టల్ విరాళం!

by  |
కరోనాను ఎదుర్కొనేందుకు లక్ష్మీ మిట్టల్ విరాళం!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనాపై పోరాడేందుకు నెమ్మదిగా వ్యాపారవేత్తలందరూ చేయి చేయి కలుపుతున్నారు. ఇప్పటికే టాటా గ్రూప్స్ రూ. 1500 కోట్లు, అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ రూ. వెయ్యి కోట్లు ప్రకటించాయి. ఈ జాబితాలోకి ఎన్ఆర్ఐ బిలీనియర్, ఇండియా స్టీల్ వ్యాపారవేత్త లక్ష్మీ మిట్టల్ కూడా కరోనాపై పోరాడేందుకు ప్రధానమంత్రి నిధికి రూ. 100 కోట్లు విరాళం ప్రకటించారు. ఆర్సెలర్ మిట్టల్ నిపాన్ స్టీల్ ఇండియా, హెచ్ఎమ్ఈఎల్ సంస్థల నుంచి ఈ విరాళాన్ని ఇస్తున్నట్టు ప్రకటించారు. ఇదే సందర్భంలో కరోనాను అడ్డుకునేందుకు భారతీయులు సమర్థవంతంగా ఉన్నారని అన్నారు. ఇటువంటి విపత్తు ఎదురైనపుడు ప్రజలకు అండగా నిలవాల్సిన బాధ్యత తీసుకుంటామని, అండగా ఉండటం అత్యంత అవసరమని పేర్కొన్నారు. కరోనా బాధితులను రక్షించుకునేందుకు, వైరస్‌పై పోరాటానికి మద్దతుగా ఈ ప్యాకేజీ ఇస్తున్నామని తెలిపారు. ఈ విరాళంతో పాటు సంస్థ తరపు నుంచి 35,000 మందికి భోజనాలను అందిస్తామని ప్రకటించారు.

Tags: Coronavirus, Coronavirus Crisis, PM CARES Fund, PM CARES Fund Coronavirus, PM CARES Fund Contribution, Lakshmi Mittal

Next Story

Most Viewed