అసలే అంటువ్యాధుల కాలం.. ఆపై పారిశుద్ధ్య లోపం.. వారి పరిస్థితేంటి..?

by  |
అసలే అంటువ్యాధుల కాలం.. ఆపై పారిశుద్ధ్య లోపం.. వారి పరిస్థితేంటి..?
X

దిశ,దుమ్ముగూడెం: దుమ్ముగూడెం మండల కేంద్రమైన లక్ష్మీనగరంలో గల సిఎస్ఐ పాఠశాల ఆవరణలో పారిశుద్ధ్యం లోపించింది. విద్యార్థులు త్రాగునీరు అవసరాల కోసం వెళ్లే మంచినీటి బోరింగ్ కనిపించనంతగా పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. కేవలం చేతిపంపు దగ్గరకు వెళ్లే కాలినడక దారి మాత్రమే బాగుంది. అది కూడా పిల్లలు నడవబట్టి అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. బోరింగ్ సమీపాన పాడుపడిన బావిని కూడా అసంపూర్తిగానే పూడ్చారు. ఇంకా పాఠశాలకు వెనుక భాగంలో గల నిరూపయోగంగా ఉన్న వంటగది గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ ప్రదేశమంతా మందుబాబులకు, సిగరెట్లు త్రాగేవారికి అడ్డాగే కాకుండా గది లోపల ప్రదేశంను బహిర్భూమిగా కూడా ఉపయోగిస్తున్నారు. దీంతో పాటుగా పాఠశాల ఆవరణ స్థలం అంతా బురదమయంగా ఉంది. అక్కడక్కడ నీరు నిల్వ ఉండడంతో దోమలు వ్యాప్తి చెందుతున్నాయి.

ఎన్నో అవాంతరాలను దాట్టుకొని చిన్నారులకు విద్యను అందించేలా మొదలైన సిఎస్ఐ పాఠశాలను స్థానిక పంచాయతీ సరిగా శానిటేషన్ పనులు నిర్వహించకపోవడం వలన పాఠశాలలో పారిశుద్ధ్యం లోపించింది. అసలే అంటువ్యాధులు విజృంభించే కాలం. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇకనైనా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, మండల పంచాయతీ స్థాయిల అధికారులు సిఎన్ఏ పాఠశాలలో పారిశుద్ధ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.


Next Story

Most Viewed